రంజాన్ వస్తుంది.. పోలింగ్ సమయం మార్చండి: సుప్రీంకోర్టు

  • Published By: vamsi ,Published On : May 2, 2019 / 05:42 AM IST
రంజాన్ వస్తుంది.. పోలింగ్ సమయం మార్చండి: సుప్రీంకోర్టు

Updated On : May 28, 2020 / 3:41 PM IST

సార్వత్రిక ఎన్నికలవేళ ఇప్పటికి నాలుగు విడతల పోలింగ్ జరగగా.. మిగిలిన విడతల పోలింగ్ సమయాలను మార్చాలంటూ దాఖలైన పిటీషన్‌లను పరిశీలనలోకి తీసుకున్న కోర్టు ఎన్నికల సంఘంను టైమ్ మార్పుల గురించి కోరనుంది.
Also Read : వల్లభనేని వంశీ ఇంటికి వచ్చాడు.. బెదరిస్తున్నాడు: వైసీపీ అభ్యర్ధి

రంజాన్ మాసం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో పోలింగ్ సమయాలను ఉదయం 7గంటల నుంచి 5గంటల వరకు కాకుండా మార్చాలంటూ ఎన్నికల సంఘంను సుప్రీంకోర్టు కోరింది. ఈ విషయమై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఎన్నికల కమీషన్‌కు సూచించింది.

అంతేకాక రాజస్థాన్ మరియు ఇతర ప్రాంతాలలో వేడి గాలులు ఎక్కువయ్యే పరిస్థితుల కారణంగా ఓటింగ్ సమయాన్ని పునరుద్దరించాలని సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్‌ను కోరింది. అయితే పోలింగ్ సమయాల్లో మార్పులపై తుది నిర్ణయం కేంద్ర ఎన్నికల సంఘం తీసుకోవలసి ఉంది.
Also Read : లింక్ ఉందంట : ఫాస్ట్ ఫుడ్‌ తీసుకుంటే టెన్షనే