Supreme Court : సీబీఐపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

సీబీఐపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రపంచం మారిందని సీబీఐ కూడా మారాల్సినవసరం ఉందని సూచించింది. వ్యక్తిగత డిజిటల్, ఎలక్ట్రానిక్ సాధానాలను అందులో డేటాను జప్తు, తనిఖీ, భద్రపరిచే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలు రూపొందించుకునేలా దర్యాప్తు సంస్థలకు ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.

Supreme Court : సీబీఐపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court

Updated On : December 6, 2022 / 1:26 PM IST

Supreme Court : సీబీఐపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రపంచం మారిందని సీబీఐ కూడా మారాల్సినవసరం ఉందని సూచించింది. వ్యక్తిగత డిజిటల్, ఎలక్ట్రానిక్ సాధానాలను అందులో డేటాను జప్తు, తనిఖీ, భద్రపరిచే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలు రూపొందించుకునేలా దర్యాప్తు సంస్థలకు ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

ఈ పిటిషన్ పై ఎస్ కే కౌల్, జస్టిస్ ఏఎస్ ఓకా ధర్మాసనం విచారణ చేపట్టింది. గోప్యత అంశంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న దర్యాప్తు సంస్థల మాన్యువల్ లు అప్ డేట్ అవుతున్నాయని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన జస్టిస్ ఎస్ కే కౌల్ మాట్లాడుతూ ప్రపంచం మారిపోయిందని, సీబీఐ కూడా మారాలని అన్నారు. తాను సీబీఐ మాన్యువల్ ను చూశానని, దాన్ని అప్ డేట్ చేయాల్సినవసరం ఉందని జస్టిస్ ఓకా సూచించారు.

Supreme court : దర్యాప్తు సంస్థలు స్వతంత్ర వ్యవస్థలా.? ప్రభుత్వాల చేతుల్లో కీలుబొమ్మలా? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

దర్యాప్తు సమయంలో అనుసరించాల్సిన విధానాన్ని సీబీఐ మాన్యువల్ లో పేర్కొంది. లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్ర సమస్య అయినందున చట్టం అమలు, నేరాల దర్యాప్తుకు సంబంధించిన అంశంపై అన్ని వర్గాల నుంచి సూచనలు, అభ్యంతరాలు తీసుకోవడం సముచితమని గతంలో ఈ అంశంపై చేసిన అఫిడవిట్ లో కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

పిటిషనర్ భయాందోళనలకు సంబంధించి సీబీఐ మాన్యువల్ 2020ని అనుసరించడం ద్వారా చాలా వాటిని తొలగించవచ్చని పేర్కొంది. మాన్యువల్ రీడ్రాఫ్ట్ చేసి ప్రకటించినట్లు తెలిపింది. దీనిపై ఫిబ్రవరి 27వ తేదీన సుప్రీంకోర్టు మరోసారి విచారణ జరుపనుంది.