అభిమాన సంఘాల అధ్యక్షులతో రేపు రజనీకాంత్ సమావేశం

  • Published By: murthy ,Published On : November 29, 2020 / 12:44 PM IST
అభిమాన సంఘాల అధ్యక్షులతో రేపు రజనీకాంత్  సమావేశం

Updated On : November 29, 2020 / 1:11 PM IST

Rajinikanth likely to announce his political entry on Nov 30 ? : తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడల్లా గత కొన్నేళ్లుగా రజనీ కాంత్ పేరు తెరమీదకు వస్తుంది. వచ్చే ఏడాది జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తలైవా పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సినీ నటుడు కమలహాసన్ ఇప్పటికే సిధ్ధం కాగా..రజనీ కాంత్ కూడా కార్యాచరణ రూపోందించటానికి సోమవారం నవంబర్ 30వ తేదీన తన అభిమాన సంఘాల అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేశారు.



నవంబ‌ర్ 30న త‌న అభిమాన సంఘాల అధ్య‌క్షుల‌ని చెన్నైకి రమ్మని ఇప్పటికే అందరికీ సమాచారం ఇచ్చారు. వారితో తొమ్మిది గంట‌ల పాటు చ‌ర్చించి ఎలా చేద్దాం, ఏం చేద్దాం అనే దానిపై రజనీ ఓ నిర్ణ‌యం తీసుకోనున్నారుట‌.



మరి ఆ రోజు ర‌జ‌నీకాంత్ ఎలాంటి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోనున్నార‌ని అంద‌రిలో ఉత్కంఠ నెల‌కొంది. కాగా, ర‌జ‌నీకాంత్‌కి కిడ్నీ మార్పిడి జ‌ర‌గ‌గా, క‌రోనా వ‌ల‌న జ‌నాల మ‌ధ్య తిర‌గ‌లేక‌పోతున్నారు. ఈ నేప‌థ్యంలో రాజ‌కీయ ఆరంగేట్రం గురించి ఆలోచిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల చెన్నై పర్యటన  అనంతరం రజనీకాంత్ అభిమానం సంఘాల అధ్యక్షులతో సమావేశం అవ్వటం ప్రాధాన్యత సంతరించుకుంది.