Calf Tearful Farewell Owner Dead Body : శ్మశానానికి వెళ్లి మరణించిన యజమానికి దూడ కన్నీటి వీడ్కోలు.. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే..

జార్ఖండ్‌లో హృదయవిదారక సంఘటన చోటు చేసుకుంది. ఓ దూడ.. యజమాని పట్ల ఉన్న ప్రేమను చాటుకుంది. ఒక దూడ శ్మశానవాటికకు పరుగెత్తుకెళ్లి యజమాని మృతదేహం దగ్గర కన్నీరు కార్చింది. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉండి తుది వీడ్కోలు పలికింది.

Calf Tearful Farewell Owner Dead Body : శ్మశానానికి వెళ్లి మరణించిన యజమానికి దూడ కన్నీటి వీడ్కోలు.. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే..

calf tearful farewell owner dead body

Updated On : September 17, 2022 / 2:20 PM IST

Calf Tearful Farewell Owner Dead Body : జార్ఖండ్‌లో హృదయవిదారక సంఘటన చోటు చేసుకుంది. ఓ దూడ.. యజమాని పట్ల ఉన్న ప్రేమను చాటుకుంది. ఒక దూడ శ్మశానవాటికకు పరుగెత్తుకెళ్లి యజమాని మృతదేహం దగ్గర కన్నీరు కార్చింది. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉండి తుది వీడ్కోలు పలికింది. హజారీబాగ్‌ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఇటీవల మరణించాడు.  దీంతో బంధువులు, స్నేహితులు అంత్యక్రియల కోసం అతని మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లారు.

అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో చనిపోయిన వ్యక్తికి చెందిన పశువుల్లోని ఒక దూడ పరుగున శ్మశానవాటికకు వచ్చింది. తనను ఎంతో ప్రేమగా చూసుకునే యజమాని కోసం వెతికింది. అక్కడున్న వారు పక్కకు జరుగడంతో చివరకు యజమాని మృతదేహం వద్దకు చేరుకుంది.

Basavaraj Bommai : పెంపుడు కుక్కకి కర్ణాటక సీఎం కన్నీటి వీడ్కోలు

దూడ..యజమాని ముఖాన్ని నాకి కన్నీరు కార్చింది. అంతేకాకుండా అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉంది. ఇది చూసిన మృతుడి బంధువులు, స్నేహితులు ఆశ్చర్యపోయారు. కాగా, ఒక యూజర్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన ఈ హృదయ విదారక వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.