రాహుల్ రోడ్ షోలో అపశృతి…ముగ్గురు జర్నలిస్ట్ లకు గాయాలు

  • Published By: venkaiahnaidu ,Published On : April 4, 2019 / 10:02 AM IST
రాహుల్ రోడ్ షోలో అపశృతి…ముగ్గురు జర్నలిస్ట్ లకు గాయాలు

Updated On : April 4, 2019 / 10:02 AM IST

వయనాడ్ లో గురువారం(ఏప్రిల్-4,2019) కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నామినేషన్ సందర్భంగా అపశృతి చోటుచేసుకుంది.రాహుల్ రోడ్ షో రూట్ లో బారికేడ్ విరిగిపోవడంతో ముగ్గరు జర్నలిస్ట్ లు గాయపడ్డారు.టీవీ9 భారత్ వర్ష్ రిపోర్టర్ సుప్రియా భరద్వాజ్,ఇండియా టుడే టీవీ రిపోర్టర్,,ఏఎన్ఐ రిపోర్టర్ లు గాయపడ్డారు.గాయపడిన జర్నలిస్ట్ లకు చేయి అందించిన రాహుల్ వారిని అంబులెన్స్ లో ఎక్కించేందుకు సాయం చేశారు.రోడ్ షోలో రాహుల్ తో పాటు ఆయన చెల్లెలు ప్రియాంకగాంధీ కూడా పాల్గొన్నారు.