Amit Shah-NTR : అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీపై మంత్రి కిషన్ రెడ్డి ఏమన్నారంటే..
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారు. వీరిద్దరు భేటీపై సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. అమిత్ షా అంతటి వ్యక్తి బాలీవుడ్ బాద్ షా ను ప్రత్యేకించి కలవటంపై పెను ఆసక్తిగా మారింది. వీరిద్దరి భేటీ వెనుక బీజేపీ వ్యూహాలు ఏంటీ? బీజేపీ ఎత్తుగడలకు సినీ గ్లామర్ కోసమా? అసలు ఏంటీ అనూహ్యంగా వీరి భేటీ వెనుక ఉన్న అసలు విషయం ఏంటీ అనేది పెను ఆసక్తిగా మారిన క్రమంలో దీనిపై మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.

kishan reddy says there is no political debate in amit shah and Hero NTR meeting
Amit Shah-NTR : మునుగోడు ఉప ఎన్నిక జరుగున్న క్రమంలో బీజేపీ ఏర్పాటు చేసిన సభకు హాజరు కావటానికి తెలంగాణ వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారు. వీరిద్దరు భేటీపై సర్వత్రా ఆసక్తి రేకెత్తించింది. అమిత్ షా అంతటి వ్యక్తి బాలీవుడ్ బాద్ షా ను ప్రత్యేకించి కలవటంపై పెను ఆసక్తిగా మారింది. వీరిద్దరి భేటీ వెనుక బీజేపీ వ్యూహాలు ఏంటీ? బీజేపీ ఎత్తుగడలకు సినీ గ్లామర్ కోసమా? అసలు ఏంటీ అనూహ్యంగా వీరి భేటీ వెనుక ఉన్న అసలు విషయం ఏంటీ అనేది పెను ఆసక్తిగా మారిన క్రమంలో దీనిపై మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్‌ల మధ్య భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని కిషన్ రెడ్డి తెలిపారు. కానీ అసలు విషయం అదికాదంటూ ఇంకా ఊహాగానాలు కొనసాగుతునే ఉన్నాయి.
మునుగోడు సభలో పాల్గొనటానికి తెలంగాణ వచ్చిన అమిత్ షా…ఆదివారం (21,2022)రాత్రి ఢిల్లీకి తిరిగి బయలుదేరే ముందు శంషాబాద్ పరిధిలోని నోవాటెల్ హెటల్‌లో ఎన్టీఆర్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీపై పలువిధాలుగా ఊహాగానాలు కొనసాగుతుండగా… దీనిపై క్లారిటీ ఇస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోమవారం స్పందించారు.
Also read : Amit Shah Meets Jr NTR : అమిత్ షాతో ముగిసిన జూ.ఎన్టీఆర్ భేటీ.. ఏం చర్చించుకున్నారంటే..
అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్‌ల మధ్య భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని..వీరి భేటీకి రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎన్టీఆర్‌తో అమిత్ షా భేటీలో వారిద్దరూ కేవలం సినిమాలకు సంబంధించిన అంశాలపైనే మాట్లాడుకున్నారని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ భేటీలో భాగంగా సీనియర్ ఎన్టీఆర్ గురించిన విషయాలను అమిత్ షా.. జూనియర్ ఎన్టీఆర్‌ను అడిగి మరీ తెలుసుకున్నారని తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి డిన్నర్ చేయాలని అమిత్ షా భావించారని..తెలిపారు. కానీ కిషన్ రెడ్డి చెప్పినదాంట్లో ఏదో మర్మం ఉందని..దేశ రాజకీయాలను తల్లక్రిందులు చేసే అమిత్ షా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను కలవటం వెనుక ఏదో పెద్ద కారణమే ఉందంటున్నారు చాలామంది.
కాగా వీరి భేటీపై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ భేటీలో రాజకీయ ప్రాధాన్యం ఉందని.. మోదీ, అమిత్ షా ఉపయోగం లేకుంటే ఎవరితోనూ మాట్లాడరని..బీజేపీని విస్తరించేందుకే జూ.ఎన్టీఆర్ ను అమిత్ షా కలిశారని భావిస్తున్నట్లు వెల్లడించారు. జూ.ఎన్టీఆర్ మద్దతుతో బీజేపీని బలపర్చేందుకు అమిత్ షా యత్నిస్తున్నారని..ఆ వ్యూహంలో భాగమే ఈ భేటీ అంటూ విశ్లేషించేసారు తనదైన శైలిలో కొడాలి నాని.