కరోనాతో ఎమ్మెల్యే కన్నుమూత

కరోనా కారణంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రముఖులు ఎందరో కన్నుమూశారు. ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్ బీజెపి ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ జినా కరోనా కారణంగా కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం ఆయన భార్య ధర్మ దేవి(నేహా) కూడా కన్నుమూశారు.
ఉత్తరాఖండ్‌లో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సురేంద్ర సింగ్ జీనా ఢిల్లీలో మరణించారు. కరోనా ఇన్ఫెక్షన్ తర్వాత జీనా ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
దాదాపు రెండు వారాల పోరాటం తరువాత, జీనా జీవిత యుద్ధంలో ఓడిపోయాడు. 2006లో, జీనా కుమావున్ మండల్ వికాస్ నిగమ్ అధ్యక్షులుగా ఉన్నారు. 2007లో మొదటిసారి భిక్షసైన్ సీటు నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
2012 ఎన్నికలలో, అతను సుల్తాన్ అసెంబ్లీ నుంచి రెండవసారి గెలవగా.. 2017లో అతను సుల్తాన్ అసెంబ్లీ నుంచి మూడవసారి గెలిచాడు. కరోనా కారణంగా సురేంద్ర సింగ్ జీనా 50 సంవత్సరాల వయసులో చనిపోయాడు. జీనా మరణం బీజేపీ సంతాపం వ్యక్తం చేసింది.