Bus Accident: కాలువలో పడ్డ బస్సు.. 15మంది మృతి

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. డెహ్రాడూన్‌లోని వికాస్‌నగర్ సమీపంలో బుల్హాద్ బైలా రోడ్డు పక్కనే ఉన్న కాలువలో అదుపుతప్పి ఓ బస్సు పడిపోయింది.

Bus Accident: కాలువలో పడ్డ బస్సు.. 15మంది మృతి

Bus (1)

Updated On : October 31, 2021 / 12:47 PM IST

Bus Accident: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. డెహ్రాడూన్‌లోని వికాస్‌నగర్ సమీపంలో బుల్హాద్ బైలా రోడ్డు పక్కనే ఉన్న కాలువలో అదుపుతప్పి ఓ బస్సు పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 15 మంది చనిపోయారు. అదే సమయంలో, చాలా మంది తీవ్రంగా గాయపడగా.. వారిని ఆసుపత్రిలో చేర్చారు.

బస్సులో ఉన్నవారు అంతా ఒకే గ్రామం నుంచి వచ్చినట్లుగా చెబుతున్నారు. పోలీసులు, SDRF బృందాలు సహాయక చర్యలో నిమగ్నమయ్యాయి. ప్రమాదానికి ఓవర్‌లోడ్ ఒక కారణమని పోలీసులు చెబుతున్నారు. బస్సు చిన్నది కాగా.. అందులో 25 మంది ఉన్నట్లు తెలుస్తుంది. ఈ బస్సు నడిచే రూట్‌లో అంతగా బస్సులు లేకపోవడంతో బస్సులో పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రయాణిస్తున్నారని చెబుతున్నారు.

ప్రమాదం గురించి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ ధామి ట్వీట్ చేస్తూ, “చక్రతా ప్రాంతంలోని బుల్హాద్-బైలా రహదారిపై జరిగిన హృదయ విదారక ఘటన నన్ను కలచివేసింది. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు తట్టుకునే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. సహాయక చర్యలు వేగవంతం చేయాలని, క్షతగాత్రులకు తక్షణ చికిత్స అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.” అంటూ ట్వీట్ చేశారు.