COVID-19 Vaccination : స్టార్ హోటళ్లలో టీకాలు వేస్తారా ? కేంద్రం కన్నెర్ర…4 ప్రాంతాల్లోనే వ్యాక్సినేషన్
నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు ఆసుపత్రులు స్టార్ హోటళ్ల సహకారంతో కొవిడ్ టీకా ప్యాకేజీలు ప్రకటించడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. హోటళ్లలో టీకాలు వేయడం జాతీయ కొవిడ్ టీకా కార్యక్రమానికి విరుద్ధమని స్పష్టం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా టీకా వేస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది.

Vaccination
Vaccination In Pvt Hotels : నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు ఆసుపత్రులు స్టార్ హోటళ్ల సహకారంతో కొవిడ్ టీకా ప్యాకేజీలు ప్రకటించడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. హోటళ్లలో టీకాలు వేయడం జాతీయ కొవిడ్ టీకా కార్యక్రమానికి విరుద్ధమని స్పష్టం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా టీకా వేస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. హోటళ్లలో వ్యాక్సినేషన్ నిర్వహించొద్దంటూ రాష్ట్రాలకు లేఖ రాసింది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి మనోహర్ రాష్ట్రాలకు టీకాల నిర్వహణపై లేఖలో వ్యాక్సినేషన్‌పై మార్గదర్శకాలు సూచించారు.
కేవలం నాలుగు ప్రాంతాల్లోనే వ్యాక్సినేషన్ వేయాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. ప్రభుత్వ వ్యాక్సినేషన్ సెంటర్లు, ప్రైవేటు ఆసుపత్రులు నిర్వహించే సెంటర్లలోనే టీకా వేయాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే ప్రభుత్వ కార్యాలయాల పరిధిలో ప్రభుత్వ దవాఖానాలు.. ప్రైవేటు కంపెనీల పరిధిలో ప్రైవేటు ఆసుపత్రులు నిర్వహించే వర్క్ ప్లేస్ కొవిడ్ సెంటర్‌లో, వయో వృధులు, దివ్యాంగుల కోసం గ్రూప్ హౌసింగ్ సొసైటీలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయాలు, కమ్యూనిటీ సెంటర్లు, స్కూళ్లు, కళాశాలలు, వృద్ధాశ్రమాల్లో, పంచాయతీ భవనాల్లో తాత్కాలిక ప్రాతిపదిక ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే టీకాలు పంపిణీ చేయాలని కేంద్రం స్పష్టం చేసింది.
స్టార్ హోటళ్లలో టీకాలు వేయడం నిబంధనలకు విరుద్ధమని, తక్షణం కార్యక్రమాన్ని నిలిపివేయాలని మార్గదర్శకాల్లో ఆరోగ్యశాఖ కార్యదర్శి ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన, పాలనాపరమైన చర్యలు చేపట్టాలన్నారు. మార్గదర్శకాల మేరకు దేశంలో కొవిడ్ టీకా జరిగేలా చూడాలని కేంద్రం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరారు. ఈ నాలుగు చోట్ల తప్ప మిగతా ఎక్కడా అందించడానికి వీల్లేదని పేర్కొన్నారు. స్టార్ హోటళ్లలో వ్యాక్సిన్ అందించడం నిబంధనలకు విరుద్ధం కాబట్టి తక్షణం ఆ కార్యక్రమాన్ని ఆపేయాలని ఆదేశించారు. అలాంటి సంస్థలపై తక్షణం పరిపాలన, చట్టపరమైన చర్యలు చేపట్టాలని నిర్దేశించారు.
Read More : Monsoon : ఒకరోజు ముందుగానే కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు