Monsoon : ఒకరోజు ముందుగానే కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ఒక రోజుముందే కేరళను తాకనున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.

Monsoon
Monsoon : నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ఒక రోజుముందే కేరళను తాకనున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. దేశంలోని ఎక్కవ మంది రైతులు ప్రతి ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కురిసే వర్షాల ఆధారంగానే వ్యవసాయం చేస్తుంటారు. అందుకే మన దేశంలో నైరుతి రుతుపవనాలకుఅంత ప్రాధాన్యం ఇస్తారు.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఓ రోజు ముందుగా, అంటే మే31 నే కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సోమవారం రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడనున్నట్లు అంచనా వేసిన అధికారులు…. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదు కానున్నట్లు తెలిపారు.