తమిళనాడు : వానల కోసం పూజలు

  • Published By: chvmurthy ,Published On : May 10, 2019 / 01:40 PM IST
తమిళనాడు : వానల కోసం పూజలు

Updated On : May 10, 2019 / 1:40 PM IST

చెన్నై : నీటి కొరతతో అల్లాడుతున్న తమిళనాడు వాసులను ఆదుకోటానికి  ప్రభుత్వం వరుణ యాగాలు చేయిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోనూ వరుణ జపాలు, యాగాలు చేయాలని ఇప్పటికే  రాష్ట్ర ప్రభుత్వం  ఆదేశాలు జారీ చేసింది. దేవాలయాల్లో పండితులు వరుణ జపాలు, యాగాలు నిర్వహిస్తుంటే , సంగీత కళాకారులు తమ తమ గాత్రాలతో, వాయిద్యాలతో వర్షపు చినుకుల కోసం  మేఘవర్షిణి, అమృతవర్షిణి  రాగాలను ఆలపిస్తున్నారు. 

తిరువణ్ణామలై,  అరుణాచలేశ్వర టెంపుల్ లోని బ్రహ్మ తీర్ధం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  తంజావూరులోనూ, చెన్నైలోని అష్టలక్ష్మీ టెంపుల్ , కపిలేశ్వరాలయం లోనూ  పండితులు పూజలు  నిర్వహించారు. తమిళనాడు  గతంలో కూడా  వానల కోసం  వరుణ యాగాలు జపాలు చేయించింది. 

varuna ragam for rains