నెలాఖరు వరకు లాక్ డౌన్.. సీఎంలతో మోడీ

నెలాఖరు వరకు లాక్ డౌన్.. సీఎంలతో మోడీ

Updated On : April 11, 2020 / 7:52 AM IST

ప్రధాని నరేంద్ర మోడీ శనివారం మధ్యాహ్నం దేశంలోని రాష్ట్ర ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మీట్ అయ్యారు. ఇందులో భాగంగా కాటన్ టవల్ ను మాస్క్ లా ధరించి చర్చలో పాల్గొన్నారు. దేశంలోని 7వేల 400మందికి ఇన్ఫెక్షన్ సోకిన కరోనా 239మందిని పొట్టనబెట్టుకుంది. మూడు వారాల లాక్ డౌన్ పొడిగింపుపై సీఎంల నుంచి సూచనలు తీసుకోవడానికి తానెప్పుడూ సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించారు. 

పంజాబ్, ఢిల్లీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు లాక్‌డౌన్ పొడిగించడమే మంచిదని తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘ఎవరైనా ముఖ్యమంత్రి సలహాలు ఇవ్వాలనుకున్నా.. నాతో మాట్లాడాలనుకున్నా.. 24గంటలు అందుబాటులో ఉంటాను. మనం ఒకరికొకరం కలిసి పనిచేయాలి’ అని ప్రధాని అన్నారు. ఆరోగ్య శాఖ వీడియో కాన్ఫిరెన్స్ లో ఓ ప్రెజెంటేషన్ ఇచ్చింది. ఆ తర్వాత సీఎంలు ఒక్కొక్కరుగా మోడీతో మాట్లాడుతున్నారు. 

గత వారం ఇంట్లో తయారుచేసిన మాస్క్ ను ప్రత్యామ్నాయంగా మరొకదానిని వాడాలని పిలుపునిచ్చింది. ఒకటి వాడుకోవడానికి మరొకటి ఉతికి ఉంచుకోవాలని మెసేజ్ పంపింది. ఒడిశా, పంజాబ్ లు లాక్‌డౌన్ పొడిగింపును ప్రకటించేశాయి. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ డిసెంబరు నుంచే ఈ మహమ్మారి వ్యాప్తి జరుగుతుందని అన్నారు. శతాబ్ద కాలంలో సంభవించిన వాటిలో ఇదే ప్రమాదకరమని సూచించారు. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదని ఒడిదుడుకులు తట్టుకుని నిలవాలని ప్రజలకు సూచించారు. 

బీహార్ ప్రభుత్వం.. కేంద్రానికి ఓ లెటర్ ద్వారా లాక్ డౌన్ పొడిగింపుపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణాలు, వరద బాధితుల సాయాన్ని కొనసాగించాలని కోరింది. గతేడాది బీహార్లో భారీగా వరదలు రావడంతో నిర్మాణాలు కొట్టుకుపోయాయి. ఈ మేరకు అక్కడ పలు చోట్ల భారీ ఎత్తులో నిర్మాణాలు జరుగుతున్నాయి. 

మిగిలిన దేశాల్లో కొవిడ్-19 ఉన్న రాష్ట్రాలు మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో లాక్‌డౌన్ తొలగించారు. ముఖ్యమంత్రులతో ఏప్రిల్ 2నే సమావేశమైన మోడీ.. ఆలోచించి సలహాలు సూచించాల్సిందిగా కోరారు. శనివారం ఏప్రిల్ 11న వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా తుది సమావేశం నిర్వహించి ఆదివారం నిర్ణయాన్ని ప్రకటిస్తారు. 

గతేడాది డిసెంబరులో తొలి కరోనా కేసు నమోదుకాగా, దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించి పరిస్థితులను అదుపులోకి తీసుకురాగలిగారు. కఠిన నిబంధనల తర్వాత పరిస్థితులు అదుపులోకి రావడంతో పాక్షికమైన లాక్ డౌన్ తో స్కూళ్లు ఇప్పటికీ మూసే ఉంచారు. రెస్టారెంట్లు డైనింగ్ లేకుండా తీసేసి హోమ్ డెలివరీలకు మాత్రమే పర్మిషన్ ఇస్తున్నారు.