లక్ అంటే అదే : రూ.3లక్షలు విలువ చేసే 52కేజీల చేపను పట్టేసిన పెద్దామె

  • Published By: nagamani ,Published On : September 30, 2020 / 11:25 AM IST
లక్ అంటే అదే : రూ.3లక్షలు విలువ చేసే 52కేజీల చేపను పట్టేసిన పెద్దామె

Updated On : September 30, 2020 / 11:41 AM IST

west bengal old women found huge 52 Kg bhola fish : వర్షాకాలం అంటే గంగమ్మ జాలరులకు వరాలు ఇచ్చేకాలం. వర్షాకాలంలో చేపలు పుష్కలంగా దొరుకుతాయి. అదృష్టం వరించిందంటే ఒక్కటంటే ఒక్క సరైన చేప దొరికితే చాలా లక్కు చిక్కినట్లే. అటువంటి లక్కే వరించింది ఓ పెద్దామెను. రోజూ చేపల వేటకు వెళ్లి దొరికిన కాడికి అమ్ముకొని కుటుంబాన్ని వెల్లదీసే ఓ వృద్ధురాలికి అదృష్టం భారీ మీనం రూపంలో వరించింది. ఏకంగా రూ. 3 లక్షల విలువ చేసే 52 కిలోల బరువున్న ఓ భారీ చేపను పట్టుకొంది ఓ వృద్ధురాలు.


పశ్చిమ బెంగాల్ లోని సాగర్ ఐలాండ్స్‌లోని సముద్రపు నీటిలో లభించిన ఈ చేపను పట్టుకున్న ఆ వృద్ధురాలు దాన్ని ఒక్కతే అతి కష్టం మీద సముద్రం నుంచి ఒడ్డుకు తీసుకువచ్చింది. ఆ వయస్సులో ఆమె తెగువ..వరించిన అదృష్టం గురించి తెలిసిన తోటి జాలరులు ఆశ్చర్యపోతున్నారు. ఆనందపడుతున్నారు.


పుష్ప కౌర్ అనే వృద్ధురాలు ఎప్పటిలాగే చేపల వేట కోసం సుందర్బన్స్ ప్రాంతంలో సముద్రంలోకి వెళ్లింది. సరిగ్గా అదే సమయంలో ఓ పెద్ద చేప గాయంతో నీటిలో కొట్టుకుని రావడం చూసింది. అంతే వెంటనే నీళ్లలోకి చేపలాగానే దూకింది. దాన్ని అతి కష్టమ్మీద చేజిక్కించుకుని ఒడ్డుకులాక్కొచ్చింది. దాన్ని పట్టుకుని మరింత సంతోషంతో మార్కెట్‌కు తీసుకెళ్లగా.. దాని బరువు 52 కేజీలు తూగింది.


52 కేజీల చేప కేజీకి రూ. 6,200 పలకడంతో ఏకంగా రూ. 3 లక్షలకుపైనే వచ్చాయి. ఒక్క చేపతో లక్షలు వచ్చిపడడంతో ఆమె ఆనందంలో ఉబ్బి తబ్బిబైపోతోంది. ఆ చేపను ఔషధాల తయారీలో ఉపయోగిస్తారట. ఈ చేప కొవ్వు, ఇతర అవయవాలను ఆగ్నేయ ఆసియా దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు. అందుకే దానికి ఆ రేంజ్ లో రేటు పలికింది.



పైగా ఆ చేప గాయపడిందికాబట్టి గానీ..అదే ఎటువంటి గాయాలు లేకుండా ఉండి ఉంటే ఎక్కువ ధర వచ్చేదని స్థానిక మత్స్యకారులు అంటున్నారు.