తల్లిదండ్రుల నుంచి పిల్లలను వేరు చెయ్యం : ఎన్ఆర్సీపై కేంద్రం హామీ

  • Published By: veegamteam ,Published On : January 6, 2020 / 07:40 AM IST
తల్లిదండ్రుల నుంచి పిల్లలను వేరు చెయ్యం : ఎన్ఆర్సీపై కేంద్రం హామీ

Updated On : January 6, 2020 / 7:40 AM IST

అసోం ఎన్ఆర్సీపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. పిల్లలను తల్లిదండ్రులు, కుటుంబాల నుంచి వేరు చేస్తున్నారని.. వారిని డిటెన్షన్ సెంటర్లకు తరలిస్తున్నారని ఓ సంస్థ సుప్రీంకోర్టుని ఆశ్రయింది. అసోం జాతీయ పౌరుల రిజిస్ట్రర్ లో పేర్లు నమోదు కాని పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరు చేస్తున్నారని, ఇది దారుణం అని పిటిషన్ లో తెలిపారు. సోమవారం(జనవరి 6,2020) దీనిపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దీనికి కేంద్ర న్యాయ శాఖ ఉన్నతాధికారి కేసీ వేణుగోపాల్ వివరణ ఇచ్చారు. పిల్లలను తల్లిదండ్రుల నుంచి కుటుంబాల నుంచి వేరు చేయము అని, ప్రస్తుతానికి ఆపేస్తామని కోర్టుకి హామీ ఇచ్చారు.

అసోంలో పౌరుల రిజిస్ట్రర్ లో కొందరు తల్లిదండ్రులు, కుటుంబాల పేర్లు ఉన్నాయి. అయితే వారి పిల్లల పేర్లు మాత్రం జాబితాలో లేవు. దీంతో పిల్లలను వేరు చేసి డిటెన్షన్ సెంటర్లకు తరలిస్తున్నారు. దీనిపై ఓ స్వచ్చంద సంస్థ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ఇది అన్యాయం అని వాదించింది. దీనిపై నాలుగు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు బెంచ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌరుల రిజిస్ట్రర్(ఎన్సాఆర్సీ) కు వ్యతిరేకంగా అసోంలో పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి. ఇవి చట్ట వ్యతిరేకం అని, రాజ్యాంగ విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ లబ్ది కోసమే బీజేపీ ప్రభుత్వం వీటిని తీసుకొచ్చిందని ఆరోపిస్తున్నారు. వీటి వల్ల తమ భాష, సంస్కృతి ప్రమాదంలో పడుతుందని భయపడుతున్నారు. పౌరసత్వ సవరణ బిల్లు ముసుగులో బీజేపీ హిందూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని ఆరోపణలు చేస్తున్నారు. తమ సొంత రాష్ట్రంలోనే భాషాపరమైన మైనారిటీలు అవుతామని వాపోతున్నారు.

Also Read : ఎర్ర జెండా ఎగరేశారు : ఇక మూడో ప్రపంచ యుద్ధమే..?