Kinjarapu Atchannaidu : డిసెంబర్‌లో ఎన్నికలు, 160 స్థానాలు మావే- అచ్చెన్నాయుడు

Kinjarapu Atchannaidu : జగన్‌ను గెలిపించి ప్రజలు తప్పు చేశారు. రాష్ట్రానికి నాలుగేళ్లుగా శని పట్టుకుంది. వైసీపీ రాజకీయాలు చూసి టీడీపీ ఉంటుందా అని భయపడ్డాను. ఆందోళన చెందాను.

Kinjarapu Atchannaidu : డిసెంబర్‌లో ఎన్నికలు, 160 స్థానాలు మావే- అచ్చెన్నాయుడు

Kinjarapu Atchannaidu (Photo : Twitter, Google)

Updated On : May 23, 2023 / 1:19 AM IST

Kinjarapu Atchannaidu On Elections : టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో డిసెంబర్ లో ఎన్నికలు వస్తాయని ఆయన చెప్పారు. ఇక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలిచేది టీడీపీనే అని జోస్యం చెప్పారు. అంతేకాదు, 160 స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారాయన. నాలుగేళ్లుగా ఏపీకి దరిద్రం పట్టిందని విమర్శించారు. పాదయాత్ర చేసి అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చారని సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు అచ్చెన్న. రాజధాని విశాఖ పేరుతో రూ.30వేల కోట్ల విలువైన భూములు ఆక్రమించారని ఆయన ఆరోపించారు.

పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో జిల్లా మినీ మహానాడు ప్రారంభమైంది. మహానాడును టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అచ్చెన్నాయుడు, ఇతర టీడీపీ నేతలు. మినీ మహానాడుకు వేలాదిగా కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన అచ్చెన్నాయుడు.. వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వస్తాయి? ఎవరు గెలుస్తారు? అనే దానిపై కీలక వ్యాఖ్యలు చేశారు.(Kinjarapu Atchannaidu)

Also Read..Karumuri Nageswara Rao : ఏ క్షణమైనా చంద్రబాబు అరెస్ట్- మంత్రి సంచలన వ్యాఖ్యలు

” నేనే సంక్షేమానికి కారణమని, నా తండ్రే కారణమని కొన్ని పిల్లకాకులు చెబుతున్నాయి. సంక్షేమానికి ఆద్యుడు ఎన్టీఆర్ అని ఆ పిల్లకాకులకి చెబుతున్నా. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రాన్ని బాగు చేయాలంటే చంద్రబాబు సీఎంగా ఉండాలని ఆయనను గెలిపించారు. 2019లో జగన్ ను గెలిపించి ప్రజలు తప్పు చేశారు. రాష్ట్రానికి నాలుగేళ్లుగా ఏలినాటి శని పట్టుకుంది.

నేను కూడా వైసీపీ రాజకీయాలు చూసి టీడీపీ ఉంటుందా అని భయపడ్డాను. ఆందోళన చెందాను. అటువంటి పరిస్థితి నుంచి రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీ 160 సీట్లు గెలుస్తుంది. ఉత్తరాంధ్ర ఓటర్లు పట్టభద్రుల ఎన్నికల్లో జగన్ కు కర్రకాల్చి వాతలు పెట్టారు. జగన్ రెడ్డికి ఆరు బంగళాలు ఉన్నాయి.(Kinjarapu Atchannaidu)

తూకం వేస్తే 20కిలోలు ఉండే జగన్ కు ఈ ఆరు బంగళాలు చాలవట. మళ్ళీ వైజాగ్ లో మరో బంగళా కావాలంట. జగన్ ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉన్న ప్రభుత్వం. అది ప్రజలను మోసం చేయడం కాదా? జగన్ పార్టీ పెద్ద డ్రామా పార్టీ. కర్నూలులో డ్రామా చూశారు కదా. పేదోడికి హార్ట్ ఎటాక్ వస్తే హైదరబాదో, బెంగళూరు తీసుకెళతారు.

అరెస్ట్ ను తప్పించుకోవడానికి అవినాశ్ రెడ్డి డ్రామా ఆడుతున్నాడు. ఆయనను అరెస్ట్ చేయడానికి సీబీఐ ఎందుకు ఆలోచిస్తుందో అర్ధం కావడం లేదు. వైసీపీ నుంచి కొత్త ఆఫర్ వచ్చింది. మేము ఆరుగురుం వస్తాం. ఒకరికి టికెట్ ఇవ్వమని అడుగుతున్నారు. డిసెంబర్ లో ఎన్నికలు వస్తున్నాయి. వైసీపీకి డిపాజిట్లు రాకుండా టీడీపీకి ఘన విజయం సాధించేలా చూడాల్సిన బాధ్యత మీదే” అని కార్యకర్తలతో అన్నారు అచ్చెన్నాయుడు.(Kinjarapu Atchannaidu)

Also Read..YS Jagan Mohan Reddy : అమరావతిలో 50వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు.. ముహూర్తం ఫిక్స్ చేసిన సీఎం జగన్

మాజీమంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ:
ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్టుపై సీబీఐ తాత్సారం చేస్తోంది. ఆయనను సీబీఐ అరెస్ట్ చేయకుండా బీజేపీ అడ్డుపడుతుందనే అనుమానం కలుగుతోంది. అవినాశ్ విషయంలో వైసీపీకి బీజేపీ వంత పాడుతోంది. వైసీపీపై బీజేపీ ఛార్జ్ షీట్లు వేయడం వలన ఫలితం లేదు. అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేసి నిజాయతీ నిరూపించుకోవాలి” అంటూ బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన పితాని సత్యనారాయణ.