ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేకు నో టికెట్..? పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ అభ్యర్థుల జాబితా రెడీ..!

పోలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్థానంలో ఆయన భార్య రాజ్యలక్ష్మికి టికెట్ ఇస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రుల స్థానాలు మాత్రం మారలేదు.

ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేకు నో టికెట్..? పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ అభ్యర్థుల జాబితా రెడీ..!

West Godavari District YCP MLA Candidates

Updated On : December 29, 2023 / 6:25 PM IST

YCP MLA Candidates : ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో అధికార వైసీపీ స్పీడ్ పెంచింది. ఇప్పటికే 11 చోట్ల మార్పులు చేసింది వైసీపీ అధిష్టానం. ఇవాళ మరో 11 స్థానాలకు గెలుపు గుర్రాలను ప్రకటించనుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది.

ఈ జిల్లాలో ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలిజాకు టికెట్ నిరాకరించినట్లు సమాచారం. అలాగే పోలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్థానంలో ఆయన భార్య రాజ్యలక్ష్మికి టికెట్ ఇస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రుల స్థానాలు మాత్రం మారలేదు.

Also Read : నలుగురు సిట్టింగ్‌లకు నో టికెట్..! ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఖరారు..!

వైసీపీలో ఇంఛార్జ్ లు మార్పుల కసరత్తు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే 11 స్థానాలకు సంబంధించి మార్పులు చేశారు. మరో 11 స్థానాలకు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. రేపు కూడా మిగిలిన స్థానాలకు ప్రకటన చేసేందుకు కసరత్తు పూర్తైంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి సీఎం జగన్ భీమవరంలో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి అభ్యర్థుల ప్రకటన రేపు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇవాళ ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి అనంతపురం జిల్లాలకు సంబంధించిన ప్రకటన ఉండబోతోంది.

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కేవలం ఒక్క చోట మాత్రమే సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ నిరాకరించినట్లు సమాచారం. చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజాకు టికెట్ లేదని ఇదివరకే జగన్ తేల్చి చెప్పారు. ఎలిజా స్థానంలో విజయ్ జయరాజ్ అనే కొత్త వ్యక్తికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక పోలవరంలో తెల్లం బాలరాజు స్థానంలో ఆయన సతీమణికి రాజ్యలక్ష్మి ఈసారి అవకాశం ఇవ్వబోతున్నారు.

ఈ రెండు మార్పులు మినహా.. మిగతా అన్ని స్థానాల్లో పాతవారినే కొనసాగించాలని జగన్ నిర్ణయించారని సమాచారం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 స్థానాలకు గాను 13 చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. పాలకొల్లు, ఉండిలో టీడీపీ విజయం సాధించింది. ఆ రెండు స్థానాల్లో ఇప్పటికే ఉన్న ఇంఛార్జ్ లను కొనసాగించాలని జగన్ నిర్ణయించారట.

పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు దాదాపుగా ఖరారు
ఏలూరు – ఆళ్ల నాని(సిట్టింగ్ ఎమ్మెల్యే, మరో అవకాశం)
చింతలపూడి – ఇక్కడ ఎమ్మెల్యే ఎలిజాకు టికెట్ నిరాకరణ.. కొత్త ఇంఛార్జిగా విజయ్ జయరాజ్
పోలవరం – తెల్లం రాజ్యలక్ష్మి (ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్థానంలో ఆయన భార్య తెల్లం రాజ్యలక్ష్మికి అవకాశం)
నిడదవోలు – శ్రీనివాసుల నాయుడు(సిట్టింగ్ ఎమ్మెల్యేకు మరో అవకాశం)
కొవ్వూరు – తానేటి వనిత
దెందులూరు – అబ్బయ్య చౌదరి (సిట్టింగ్ ఎమ్మెల్యేకు మరో అవకాశం)
గోపాలపురం – తలారి వెంకట్రావ్ (మరో అవకాశం)

Also Read : ఏపీలో ఈసారి గెలుపు ఎవరిది? టీడీపీ ప్లస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ ఏవి?

ఉంగుటూరు – పుప్పాల శ్రీనివాసరావు (మరో అవకాశం)
నరసాపురం – ప్రసాద్ రాజు(సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, కొనసాగింపు)
భీమవరం – గ్రంథి శ్రీనివాస్(మరోసారి కొనసాగింపు)
పాలకొల్లు – 2019లో టీడీపీ గెలిచింది. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా గుడాల గోపికీ అవకాశం
ఉండి – 2019లో టీడీపీ గెలిచింది. ఇక్కడ కొత్తగా పీవీఎల్ నరిసింహరాజుకు అవకాశం
ఆచంట – మాజీమంత్రి చెరుకువాడ శ్రీ రంగరాజు కొనసాగింపు
తాడేపల్లి – కొట్టు సత్యనారాయణ(సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి.. మరో అవకాశం)
తణుకు – కారుమూరి నాగేశ్వరరావు(సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి.. మరో అవకాశం)