గొంతు నొక్కితే ఊరుకోను : టీడీపీకి స్పీకర్ వార్నింగ్
ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతుండగా టీడీపీ నేతలు అతని ప్రసంగానికి అడ్డుపడ్డారు. దీంతో టీడీపీ సభ్యులు తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతుండగా టీడీపీ నేతలు అతని ప్రసంగానికి అడ్డుపడ్డారు. దీంతో టీడీపీ సభ్యులు తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభం అయ్యాయి. స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సభలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతుండగా టీడీపీ నేతలు ప్రసంగానికి అడ్డుపడ్డారు. దీంతో టీడీపీ సభ్యులు తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. వంశీ కూడా ఓ ప్రజాప్రతినిధి అన్నారు. ప్రజా సమస్యలపై తన అభిప్రాయం చెప్పుకునే ఒకే ఒక వేదిక అసెంబ్లీ అన్నారు. సభలో సభ్యుడి గొంతునొక్కే ప్రయత్నం చేస్తే ఊరుకోనని స్పష్టం చేశారు. ఆయన అభిప్రాయం చెప్పుకోనివ్వండన్నారు.
తాను సీఎంను కలిస్తే చంద్రబాబుకు ఉలుకెందుకు అని వంశీ ప్రశ్నించారు. తాను సీఎంను కలవడం ఇదే మొదటిసారి కాదన్నారు. గతంలో పోలవరం కాలువ భూ సేకరణ సమస్యపై సీఎంతో మాట్లాడనని తెలిపారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిశానని అన్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటున్న బాబుకు భయమెందుకని ప్రశ్నించారు.
సోషల్ మీడియాలో తనను బూతులు తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని ప్రస్తావించారు. పప్పు బ్యాచ్ తనను టార్గెట్ చేసిందన్నారు. జయంతికి, వర్థంతికి తేడా తెలియదన్నారు. టీడీపీలో తాను కొనసాగలేనన్నారు. తనను ప్రత్యేక సభ్యుడి కింద గుర్తించి..తన హక్కులను కాపాడాలని స్పీకర్ కు రిక్వెస్ట్ చేశారు.
వంశీ మాట్లాడితే మీకు వచ్చే సమస్య ఏంటని స్పీకర్ ప్రశ్నించారు. ఆయనకు కూడా ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలన్నారు. గౌరవ సభ్యుల గొంతు నొక్కే ప్రయత్నం శాసనసభలో చేస్తే ..దాన్ని ఎట్టిపరిస్థితుల్లో అనుమతించనని అన్నారు.