ఏపీ కాంగ్రెస్ చీఫ్ కోసం అభిప్రాయ సేకరణ
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడి కోసం విజయవాడలో అభిప్రాయ సేకరణ జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు, జిల్లా ఇంచార్జీలు, వివిధ సంఘాల నేతలు సహా ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ ఉమెన్

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడి కోసం విజయవాడలో అభిప్రాయ సేకరణ జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు, జిల్లా ఇంచార్జీలు, వివిధ సంఘాల నేతలు సహా ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ ఉమెన్
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడి కోసం విజయవాడలో అభిప్రాయ సేకరణ జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు, జిల్లా ఇంచార్జీలు, వివిధ సంఘాల నేతలు సహా ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ ఉమెన్ చాందీ తమ అభిప్రాయాలను వివరించారు. కాంగ్రెస్ శ్రేణుల అభిప్రాయాన్ని అధిష్టానానికి రిపోర్డు అందించనున్నారు. పీసీసీ రేసులో తులసి రెడ్డి, శైలజానాథ్, పల్లంరాజు, చింతా మోహన్ పేర్లు వినిపిస్తున్నాయి.
శుక్రవారం విజయవాడ వచ్చిన ఊమెన్.. 2వ తేదీ మధ్యాహ్నం వెళ్లిపోయారు. కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు పోటీలో లేరంటూ ప్రచారం జరిగింది. దీనికి భిన్నంగా అకస్మాత్తుగా పల్లంరాజుకు పీసీసీ బాధ్యతలు అప్పగించాలంటూ కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు కొందరు ఊమెన్ దగ్గర డిమాండ్ చేశారు. అదే సమయంలో అదే సామాజిక వర్గానికి చెందిన కొందరు కేఆర్కే నాయుడి పేరును ప్రతిపాదించారు. దీనితో ఇరు వర్గాలూ మాటల యుద్ధానికి దిగాయి.