Maharashtra Politics: నిన్న షిండేకు సీఎం కుర్చీ, నేడు అజిత్ పవార్‌కు కీలక శాఖలు! శివసేన, ఎన్సీపీలతో పొత్తులో నిండా మునిగింది బీజేపీనే
40 సీట్లు ఉన్న షిండే వర్గానికి ముఖ్యమంత్రి పదవితో పాటు ఎనిమిది మందికి మంత్రి పదవులు ఇచ్చారు. ఇక కేవలం 30 స్థానాలే ఉన్న అజిత్ పవార్ వర్గానికి ఉప ముఖ్యమంత్రితో పాటు ఎనిమిది మంత్రి పదవులు ఇచ్చారు.

Shiv Sena-BJP-NCP Alliance: తమకు ద్రోహం చేసినందుకు ప్రతిఫలం అనుభవించాల్సిందే అంటూ చీలిక శివసేనతో పొత్తు పెట్టుకున్న అనంతరం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాట. ఉద్ధవ్ థాకరే ఎన్నికల ఒప్పందాన్ని కాలరాసి కాంగ్రెస్, ఎన్సీపీలతో పొత్తు పెట్టుకున్నారని, బీజేపీకి ద్రోహం చేశారని ఆయన వాదన. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ నేతృత్వంలోని మహా వికాస్ అగాఢీ ప్రభుత్వం అయితే కూలింది. ఆ వెంటనే బీజేపీ, శివసేన (షిండే వర్గం)తో పొత్తు పెట్టుకోవడం.. షిండే ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం.. ఆ పిమ్మట మంత్రివర్గ విస్తరణ చకచకా జరిగిపోయాయి.
Karnataka: బెంగళూరు జంట హత్యల కేసుకు సంబంధించి షాకింగ్ వీడియో
అధికారం కోసం పార్టీని చీల్చారనే అపవాదులను తొలగించుకోవడానికో ఏమో.. తమకు షిండే వర్గం కంటే రెండు రెట్లకు పైగా ఎక్కువ సీట్లు బీజేపీకి ఉన్నప్పటికీ.. సమస్థాయిలో మంత్రులకు అవకాశం ఇచ్చారు. ఇలా ఓ ఏడాది గడిచింది. లేటెస్టుగా ఎన్సీపీ వర్గం చీలిపోయింది. పార్టీలో శరద్ పవార్ తర్వాత కీలకంగా ఉండే అజిత్ పవార్.. తనతో పాటు ఎనిమిది మంది ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వంలో కలిశారు. ఆ వెంటనే అజిత్ పవార్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి, ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు వచ్చాయి.
Bihar: టీచర్ల పోస్టింగుపై నిరసన చేస్తుండగా పోలీసుల లాఠీచార్జ్.. బీజేపీ నాయకుడు మృతి
ఇంత వరకు తెలిసిన విషయమే. అయితే తాజాగా అజిత్ పవార్‌కు కీలక మంత్రిత్వ శాఖ అయిన ఆర్థిక శాఖను కేటాయించనున్నారట. ఇది కనుక నిజమైతే అజిత్ పవార్ పంతం నెగ్గినట్టే. తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ.. బీజేపీ, శివసేనతో సహా మంత్రి పదవులు తీసుకుని, కొన్ని కీలక శాఖలు తీసుకున్నారు అజిత్ పవార్. ఇక తాజాగా ఆర్థిక శాఖపై కన్నేశారు. ఇది ఆయనకు వస్తే.. ప్రభుత్వంలో అత్యంత కీలకంగా ఆయన మారిపోతారు.
ఇంతటి డ్రామాలో అత్యంత నష్టపోయింది భారతీయ జనతా పార్టీయే. 40 సీట్లు ఉన్న షిండే వర్గానికి ముఖ్యమంత్రి పదవితో పాటు ఎనిమిది మందికి మంత్రి పదవులు ఇచ్చారు. ఇక కేవలం 30 స్థానాలే ఉన్న అజిత్ పవార్ వర్గానికి ఉప ముఖ్యమంత్రితో పాటు ఎనిమిది మంత్రి పదవులు ఇచ్చారు. కానీ 105 స్థానాలున్న బీజేపీకి కూడా ఒక ఉప ముఖ్యమంత్రితో పాటు ఎనిమిది మంది మంత్రులు కేటాయింపులు అయ్యాయి. శివసేన, ఎన్సీపీ కలిపినా 70 స్థానాలు. బీజేపీ కంటే 35 స్థానాలు తక్కువ. కానీ కీలక పదవులు, ఎక్కువ పదవులు ఆ రెండు వర్గాలకు వెళ్లడం పట్ల బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వినిపిస్తోంది.
అజిత్ పవార్ వర్గం చేరికతో వచ్చిన అసంతృప్తి ఇది ఒక్క బీజేపీతోనే ఆగిపోలేదు. షిండే వర్గంలో గొణుగుడు మొదలైందట. మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో జాప్యానికి ఆర్థిక, ప్రణాళికా శాఖల విషయంలో అజిత్ పవార్ శిబిరం, ఏక్నాథ్ షిండే వర్గానికి మధ్య ఉన్న ప్రతిష్టంభన ఏర్పడిందని సమాచారం. ఎన్సీపీ ఆర్థిక, సహకార మంత్రిత్వ శాఖలను దక్కించుకోవడంపై పవార్ మొండిగా ఉన్నారని, అయితే షిండే శిబిరం దీనిపై అసంతృప్తిగా ఉందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
Delhi Viral Video : ఫుట్‌పాత్‌పై జీవిస్తున్న మహిళతో యువతి డ్యాన్స్ .. నెటిజన్లు ఫిదా..
జూలై 10-11 తేదీల్లో ముఖ్యమంత్రి షిండేతో పాటు ఉప ముఖ్యమంత్రులు ఫడ్నవీస్, అజిత్ పవార్ మధ్య అర్థరాత్రి జరిగిన చర్చల్లో ఈ గొడవ పరిష్కారమై ఉండవచ్చనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ బుధవారం మాట్లాడుతూ, పోర్ట్‌ఫోలియోల పంపిణీ సమస్య పరిష్కారానికి వచ్చిందని, ఒకటి రెండు రోజుల్లో పోర్ట్‌ఫోలియోల కేటాయింపు జరుగుతుందని పేర్కొన్నారు. అజిత్ పవార్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉపముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బీజేపీ నాయకత్వాన్ని కలవకలేదని, అందుకే మర్యాదపూర్వక పర్యటన కోసం ఇక్కడకు వచ్చామని అన్నారు. పోర్ట్‌ఫోలియో కేటాయింపు విషయంలో బీజేపీ-శివసేన-ఎన్‌సీపీ కూటమిలో విభేదాలు పెరుగుతున్నాయన్న వార్తలను పటేల్ తోసిపుచ్చారు.