చంద్రబాబుపై కేసుపెట్టిన బీజేపీ మహిళానేత

చంద్రబాబుతో ప్రాణభయం ఉందంటూ కేసు పెట్టిన బీజేపీ మహిళా నేత

  • Published By: chvmurthy ,Published On : January 7, 2019 / 08:16 AM IST
చంద్రబాబుపై కేసుపెట్టిన బీజేపీ మహిళానేత

Updated On : January 7, 2019 / 8:16 AM IST

చంద్రబాబుతో ప్రాణభయం ఉందంటూ కేసు పెట్టిన బీజేపీ మహిళా నేత

కాకినాడ: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వల్ల  బీజేపీ  నేతలకు కార్యకర్తలకు ప్రమాదం పొంచిఉందని, రక్షణ కల్పించాలని కోరుతూ తూర్పుగోదావరిజిల్లా కాకినాడకు చెందిన బీజేపీ కార్పోరేటర్ సాలిగ్రామ లక్ష్మీప్రసన్న సర్పవరం పోలీసుస్టేషన్లో  ఫిర్యాదు చేశారు.
వివరాల్లోకి వెళితే సీఎం చంద్రబాబునాయుడు ఇటీవల కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని, బీజేపీ పైన తీవ్ర విమర్శులు చేస్తున్నసంగతి తెలిసిందే. జనవరి 4న ఆయన కాకినాడ పర్యటనకు వెళ్లిన సందర్భంలోబీజేపీ  నాయకులు కార్యకర్తలుసీఎంకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.  సీఎం బస్సు దిగివచ్చి నిరసన తెలపటానికి వచ్చిన ప్రసన్న లక్ష్మితో మాట్లాడుతూ….రాష్ట్రానికి మోసం చేసిన ప్రధాని మోదీని వెనకేసుకుని వస్తున్నారు, సిగ్గులేదా, ఫినిష్‌ అయిపోతారంటూ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ప్రసన్నలక్ష్మి ఆదివారం స్ధానికనాయకులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.