కలకలం : వైసీపీ ఎంపీ అభ్యర్థి ఇళ్లల్లో CBI సోదాలు

  • Published By: veegamteam ,Published On : April 30, 2019 / 08:37 AM IST
కలకలం : వైసీపీ ఎంపీ అభ్యర్థి ఇళ్లల్లో CBI సోదాలు

Updated On : April 30, 2019 / 8:37 AM IST

హైదరాబాద్‌, పశ్చిమగోదావరి జిల్లాలోని వైసీపీ నేత ఇళ్లలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. నర్సాపురం ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణం రాజు ఇళ్లలో సీబీఐ అధికారులు తనిఖీలు చేశారు. రఘురామకృష్ణం రాజు.. రుణాలు తిరిగి చెల్లించండంలో విఫలమయ్యారని బ్యాంకుల అధికారులు ఫిర్యాదు చేశారు.

బ్యాంకు రుణాలు ఎగవేతపై గతంలో ఆయనపై కేసు నమోదు చేశారు. బెంగళూరు నుంచి వచ్చిన సీబీఐ అధికారులు.. హైదరాబాద్ గచ్చిబౌలిలోని రఘురామకృష్ణం రాజు నివాసంతోపాటు.. పశ్చిమగోదావరి జిల్లాలోని నివాసంలోనూ సోదాలు చేశారు.