మోడీది రాక్షస పాలన : చంద్రబాబు

కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. మోడీ దుర్మార్గంగా వ్యవహరిస్తూ రాక్షస పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Published By: veegamteam ,Published On : April 5, 2019 / 08:01 AM IST
మోడీది రాక్షస పాలన : చంద్రబాబు

Updated On : April 5, 2019 / 8:01 AM IST

కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. మోడీ దుర్మార్గంగా వ్యవహరిస్తూ రాక్షస పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. మోడీ దుర్మార్గంగా వ్యవహరిస్తూ రాక్షస పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని కూని చేస్తున్నారని ఆరోపించారు. విజయవాడ, తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర చంద్రబాబు నిరసన వ్యక్తం చేశారు. ఐటీ, పోలీసుల దాడులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also : ఎన్నికల తర్వాత మోడీ జైలుకు: రాహుల్ గాంధీ

వైసీపీతో కలిసి మోడీ చాలా దుర్మార్గంగా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. విభజన చట్టంలోని హామీలు అమలు చేయంటే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని హెచ్చరించారు. ఇలాంటి పార్టీలు, వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జగన్ హైదరాబాద్ నుంచి కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని విమర్శించారు. ‘మీ బెదిరింపులకు మేము భయపడం’ అని చంద్రబాబు హెచ్చరించారు. 
Read Also : లక్ష్మీ పార్వతిపై లైంగిక వేధింపుల కేసు నమోదు