కాంగ్రెస్ నేతలు మాకాళ్లు మొక్కినా మేం వారిని కిడ్నాప్ చేయం : సీఎం కేసీఆర్
కాంగ్రెస్ పై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రజలు నిరాకరించినా కాంగ్రెస్ కు బుద్ధి రాలేదని విమర్శించారు.

కాంగ్రెస్ పై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రజలు నిరాకరించినా కాంగ్రెస్ కు బుద్ధి రాలేదని విమర్శించారు.
కాంగ్రెస్ పై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రజలు నిరాకరించినా కాంగ్రెస్ కు బుద్ధి రాలేదని విమర్శించారు. అసత్య ఆరోపణలు చేయడం కాంగ్రెస్ కు అలవాటు ఎద్దేవా చేశారు. అసత్య ఆరోపణలు ఆపేందుకే సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. శనివారం (మార్చి 7, 2020) అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ నీరు గార్చేందుకు ప్రయత్నించిందని విమర్శించారు. నాడు తెలంగాణ పదం ఉచ్చరించడానికి వీలు లేకుండా చేశారని తెలిపారు. అన్ని వర్గాల వారిని ఏకం చేసి, కేంద్రం మెడల వంచి తెలంగాణ సాధించామని తెలిపారు. నాడు మేం వెనుకంజ వేసినా తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యేది కాదన్నారు.
కాంగ్రెస్ నేతలను మేం కిడ్నాప్ చేశామని అసత్య ఆరోపణలు
కాంగ్రెస్ నేతలను మేం కిడ్నాప్ చేశామని అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు మా కాళ్లు మొక్కినా మేం కిడ్నాప్ చేయం, మాకా అవసరం ఏముందని ప్రశ్నించారు. ఈవీఎంలలో అవకతవకలకు పాల్పడ్డామని తమపై ఆరోపణలు చేశారని తెలిపారు. బ్యాలెట్ పేపర్ తో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో 32 కు 32 స్థానాలను గెలిచామని తెలిపారు. తాము తప్పులు చేసుంటే ప్రజలు మాకు ఓటుతో బుద్ధి చెప్పేవాళ్లన్నారు. తాము అభివృద్ధి కోసం పాటు పడుతున్నాం కాబట్టే..ఎన్నికేదైనా మాకే పట్టం కడుతున్నారని తెలిపారు.
అసత్యాలు చెప్పేవారిని సభలో కూర్చొనివ్వాలా?
కాంగ్రెస్ నేతలు గెలిస్తే గెలిచినట్లు, టీఆర్ఎస్ నేతుల గెలిస్తే డబ్బులు పంచి గెలిచినట్టా అన్నారు. అహంకార పూరితంగా వ్యవహరించే నేతలెవరో నల్గొండ జిల్లా ప్రజలకు తెలుసన్నారు. నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్లు అరిస్తే ఎలా అన్నారు. మేం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే, ప్రజలు మాకు ఓట్లేసే ఎందుకు గెలిపిస్తారని ప్రశ్నించారు. అసత్యాలు చెప్పేవారిని సభలో కూర్చొనివ్వాలా అన్నారు. సభను తప్పుదోవ పట్టించే వ్యక్తులు అసెంబ్లీలో కూర్చునేందుకు అర్హులా అన్నారు. (తెలంగాణ స్త్రీ శక్తులు మంగ్లీ,ఇస్మార్ట్ గంగవ్వలు: అవార్డులు ప్రకటించిన ప్రభుత్వం)
మిషన్ భగీరథ అద్భుతమైన పథకం
మిషన్ భగీరథ అద్భుతమైన పథకం అన్నారు. 11 రాష్ట్రాలకు మిషన్ భగీరథ గురించి అడిగి తెలుసుకున్నాయన్నారు. తెలంగాణ ఇంజినీర్ల సహకారం కోరాయన్నారు. మిషన్ భగీరథపై మాట్లాడలేక సభ నుంచి కాంగ్రెస్ సభ్యులు పారిపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలన పుణ్యమా అని నల్గొండ ప్రజల నడుములు వంగిపోయాయన్నారు. మిషన్ భగీరథ పుణ్యమా అని నల్లగొండలో ఫ్లోరైడ్ అంతమైందన్నారు. మిషన్ భగీరథ ఫలాలు ప్రతీ పల్లెకు అందుతున్నట్లు గ్రామ పంచాయతీలు తీర్మానాలు వచ్చాయన్నారు. మిషన్ భగీరథ ఫలాలు పల్లెపల్లెకు అందుతున్నట్లు గ్రామ కమిటీ తీర్మానాలు వచ్చాయన్నారు.
10 జిల్లాలను 33 జిల్లాలకు పెంపు
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జిల్లాలను పెంచుకోని రాష్ట్రాలు పశ్చిమబెంగాల్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 జిల్లాలను 33 జిల్లాలకు పెంచుకున్నామని తెలిపారు. ఏపీలో త్వరలో 13 జిల్లాలను 25 జిల్లాలుగా చేయబోతున్నట్లు సమాచారం అన్నారు.