సీఎం జగన్‌తో వల్లభనేని వంశీ కీలక భేటీ.. ఏం జరుగుతోంది, గన్నవరం అభ్యర్థిపై క్లారిటీ ఇచ్చేస్తారా?
గత కొన్నిరోజులుగా వంశీ కూడా పూర్తిగా గన్నవరం నియోజకవర్గానికి కాస్త దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం లేదు.

Vallabhaneni Vamsi Key Meeting With CM Jagan
Vallabhaneni Vamsi : ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కొడాలి నాని తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసుకి వెళ్లారు. ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. గన్నవరం నియోజకవర్గం పరిస్థితిపై సీఎం జగన్ తో చర్చిస్తున్నారు. గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ, గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని ఇవాళ తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వెళ్లి ముఖ్యమంత్రి జగన్ తో సమావేశం కావడం రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. చాలా కాలంగా గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ తో వారిద్దరూ కీలకమైన అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది.
Also Read : కృష్ణా జిల్లాలో టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ.. అభ్యర్థులు వీళ్లే?
ముఖ్యంగా వల్లభనేని వంశీ గన్నవరం నుంచే పోటీ చేస్తారా అనే అంశానికి సంబంధించి అనేకసార్లు వివిధ ప్రచారాలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరుగుతున్నాయి. వాటితో పాటు వైసీపీలోనూ దీని గురించి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ఇప్పుడు వంశీ సీఎం జగన్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. గన్నవరంలో ఉన్న రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అయితే, ఏదైనా మార్పు ఉంటుందా? లేదా? అన్న దానికి సంబంధించి కూడా సీఎం జగన్.. ఎమ్మెల్యే వంశీకి క్లారిటీ ఇవ్వబోతున్నారు.
గత కొన్నిరోజులుగా వంశీ కూడా పూర్తిగా గన్నవరం నియోజకవర్గానికి కాస్త దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం లేదు. కానీ, ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరయ్యారు. తాజాగా సీఎం జగన్ ను కలిసి గన్నవరంలోని పరిస్థితులపై చర్చిస్తున్నారు. ప్రస్తుతానికి గన్నవరం నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జిగా వంశీ ఉన్నారు. ఆయననే కొనసాగిస్తారా? లేదా? అన్న క్లారిటీ రాబోతోంది. కొన్ని రోజులుగా గన్నవరం నియోజకవర్గం చుట్టూ ఉన్న అనేక రాజకీయ ప్రచారాలకు సంబంధించి ఇవాళ ఓ స్పష్టత రానుందని సమాచారం.
Also Read : నర్సాపురం వైసీపీలో ఆసక్తికర రాజకీయం.. ఏం జరుగుతుందో తెలుసా?