ఏపీలో ఒంటరి పోరు: ఢిల్లీలో తేల్చి చెప్పిన చంద్రబాబు

  • Published By: chvmurthy ,Published On : February 1, 2019 / 01:51 PM IST
ఏపీలో ఒంటరి పోరు: ఢిల్లీలో తేల్చి చెప్పిన చంద్రబాబు

Updated On : February 1, 2019 / 1:51 PM IST

ఢిల్లీ : వచ్చే ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయం అని ఏపీ సీఎం చంద్రబాబు స్పృష్టం చేశారు. జాతీయ స్ధాయిలో దేశ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ తో కలిసి ముందుకు వెళ్తాం అని ఆయన అన్నారు.  దేశాన్ని రైతు సమస్యలు, నిరుద్యోగ సమస్య పీడిస్తున్నాయని బాబు  చెప్పారు. బిజెపికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా  పోరాడేందుకు విపక్షాలన్నీ ఐక్యంగా ముందుకు వెళ్తాం అని చంద్రబాబు పేర్కోన్నారు.

ఢిల్లీలోని  కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో సేవ్‌ డెమాక్రసీ పేరుతో జరిగిన విపక్షాల సమావేశంలో చంద్రబాబు  పాల్గోన్నారు. సమావేశం అనంతరం… రాహుల్, చంద్రబాబు ఒకే వాహనంలో రాహుల్ నివాసానికి వెళ్లారు. ఎన్నికల్లో ఈవీఎం యంత్రాలలో ఎవరికి ఓటు వేశారో తెలియడం లేదని, ఈవీఎం వివిపాట్ యంత్రాలు,ఎన్నికల నిర్వహణ అంశాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తాం అని చంద్రబాబు చెప్పారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు విపక్షాలన్నీ కలిసి ఎన్నికల కమిషనర్ ను కలుస్తాం అని ఆయన తెలిపారు.