మీ ఇడుపులపాయ ఎస్టేట్ బాగుండాలి.. కానీ రైతులు మాత్రం బాగుండకూడదా : పవన్ కళ్యాణ్
ఏపీ సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అమరావతి రాజధానిగా ఆనాడు అసెంబ్లీలో జగన్ ఎందుకు ఒప్పుకున్నారని ప్రశ్నించారు.

ఏపీ సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అమరావతి రాజధానిగా ఆనాడు అసెంబ్లీలో జగన్ ఎందుకు ఒప్పుకున్నారని ప్రశ్నించారు.
ఏపీ సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అమరావతి రాజధానిగా ఆనాడు అసెంబ్లీలో జగన్ ఎందుకు ఒప్పుకున్నారని ప్రశ్నించారు. రాజధాని కోసం 33 వేల ఎకరాలు కావాలని ఆనాడు అసెంబ్లీలో ఎందుకు ఒప్పుకున్నారని నిలదీశారు. ఆనాడే వ్యతిరేకించి ఉంటే ఇవాళ ఆడబిడ్డలు రోడ్డక్కేవారు కాదు కదా అన్నారు పవన్. మంగళవారం (డిసెంబర్ 31, 2019) మందడంలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజానికి కర్నూలులోనే రాజధాని, ఉత్తరాంద్రలోని శ్రీకాకుళం, వైజాగ్ లోనే రాజధాని అని ఆరోజే జగన్ చెప్పుంటే… ఒకే చోట కాకుండా వేర్వేరు చోట ఇస్తున్నారని అందరూ సంతోషంగా ఒప్పుకునేవాళ్లమని చెప్పారు.
మీ ఇడుపులపాయ ఎస్టేట్ బాగుండాలి.. మీ సిమెంట్ ఫ్యాక్టరీలు బాగుండాలి… కానీ రాజధానికి భూములు ఇచ్చిన రైతులు మాత్రం బాగుండకూడదా అని జగన్ ను పవన్ ప్రశ్నించారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఎవరి ఇష్టప్రకారం వారు చేస్తామంటే చట్ట సభలకు విలువ ఉండన్నారు. తమ ఇష్టంతోనే రాజధాని కోసం భూములు ఇస్తున్నామని రైతులు చెప్పారని తెలిపారు. పిల్లల భవిష్యత్ కోసం భూములు ఇస్తున్నారని రైతులు చెప్పారని గుర్తు చేశారు. అంచెలంచెలుగా రాజధాని అభివృద్ధి జరగాలని ముందునుంచి చెప్పామని వెల్లడించారు. రైతులు భూములు ఇచ్చింది ప్రభుత్వానికి, రాజధాని కోసమని చెప్పారు. అమరావతి రాజధానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారని తెలిపారు. 2014 ఎన్నికలకు ముందు గాంధీనగర్ లో తాను మోడీని కలిసినప్పుడు రాజధాని ప్రస్తావన వచ్చిందని గుర్తు చేశారు.
ఆనాడు భూ సమీకరణ ద్వారా భూములు సేకరించారని తెలిపారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరినీ అయోమయంలోకి నెట్టేశారని మండిపడ్డారు. రైతులను రోడ్డుపాలు చేయడమంటే వారిని అవమానించడమేనని స్పష్టం చేశారు. రైతు కన్నీరు పెడితే ఏ ప్రాంతం కూడా బాగుండదన్నారు. ఆందోళనలు చేసే వారిని పెయిడ్ ఆర్టిస్టులని వైసీపీ నేతలంటున్నారని తెలిపారు. ప్రభుత్వాలు రాజ్యాంగానికి కట్టుబడి పాలనా సాగించాలన్నారు. ఒకవేళ రాజధానిని మార్చాలంటే ప్రజల ఏకాభిప్రాయం సాధించాలన్నారు. వైసీపీకి ఓట్లేసి గెలిపిస్తే అమరావతి రైతులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని పవన్ ప్రశ్నించారు.
రాజధాని ప్రాంత రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పోలీసుల కేసులకు భయపడొద్దని రైతులకు సూచించారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. రైతులు చేపట్టిన రిలే దీక్షలు 14 వ రోజు కొనసాగుతున్నాయి. రైతుల ఆందోళనలకు మద్దతుగా పవన్..అమరావతిలో పర్యటించారు. ఎర్రపాలెంలో రైతులతోపాటు దీక్షలో కూర్చుని రైతులకు మద్దుతు ప్రకటించారు. మహిళలు తమ సమస్యలను పవన్ కు వివరించారు.