చంద్రబాబుకి మానవత్వం లేదు : మంత్రి బుగ్గన
చంద్రబాబు మానవత్వం లేకుండా వ్యవహరించారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. బాబు సీఎంగా ఉన్నప్పుడు తమ నియోజకవర్గాలకు నిధులు ఇవ్వలేదన్నారు. ప్ర

చంద్రబాబు మానవత్వం లేకుండా వ్యవహరించారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. బాబు సీఎంగా ఉన్నప్పుడు తమ నియోజకవర్గాలకు నిధులు ఇవ్వలేదన్నారు. ప్ర
చంద్రబాబు మానవత్వం లేకుండా వ్యవహరించారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఏపీ అసెంబ్లీ సమవేశాల్లో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబు సీఎంగా ఉన్నప్పుడు తమ నియోజకవర్గాలకు నిధులు ఇవ్వలేదన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. కొత్త సంస్కృతికి గత ప్రభుత్వం తెరలేపిందన్నారు. జగన్ సీఎం అయ్యాక అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇస్తున్నారని చెప్పారు.
గత ప్రభుత్వానికి.. ఈ ప్రభుత్వానికి తేడా తెలుసుకోవాలన్నారు. 2018-19 సంవత్సరానికి రూ.3 వేల కోట్లు కేటాయించి.. ఈ ప్రభుత్వంలో రూ.4134 కోట్లు కేటాయించామని తెలిపారు. సివిల్ సప్లై కార్పొరేషన్ కు రూ.20 వేల కోట్ల అప్పు ఉందని తెలిపారు. టీడీపీ హయాంలో రూ.13 వేల 500 కోట్లు అప్పు చేశారని చెప్పారు. అప్పు చేసి తీసుకున్న డబ్బును ఇతర పథకాలకు వాడారని ఆరోపించారు.