Ghulam Nabi Azad: మోదీ నాకోసం కన్నీళ్లు కార్చారు, కాంగ్రెస్ ఒక్క ట్వీట్ కూడా చేయలేదు.. గులాం నబీ ఆజాద్ మళ్లీ ఫైర్
ఇక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా బయటికి వెళ్తున్నారు. కొందరు బీజేపీలో చేరుతుండగా, మరికొందరు సొంత కుంపట్లు పెట్టుకుంటున్నారు. ఇందులో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ ఒకరు. ఈయన 2015 ఆగస్టులో పార్టీని వీడారు

PM Modi tears fo Gulam Nabi Azad (file photo)
Ghulam Nabi Azad: కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీపై ముఖ్యంగా గాంధీ కుటుంబంపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్న ఆ పార్టీ మాజీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తాజాగా మరోమారు అస్త్రాలు ఎక్కుపెట్టారు. తాను ఎంపీగా రిటైర్మెంట్ తీసుకుంటున్న సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనకోసం కన్నీళ్లు కార్చారని, అయితే సొంత పార్టీ అయిన కాంగ్రెస్ నేతలు మాత్రం కనీసం ఒక ట్వీట్ కూడా చేయలేదని మండిపడ్డారు. ఆజాద్ 2021 సంఘటనను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ తనను ప్రశంసించిన విషయాన్ని గుర్తు చేశారు. దివంగత ప్రధాని పీవీ నరసింహారావు మాదిరిగానే ప్రధాని మోదీకి సహనం ఉందని ఆజాద్ అన్నారు.
CR Kesavan: బీజేపీలోకి కాంగ్రెస్ నేతల చేరిక పర్వం.. తాజాగా దేశ తొలి గవర్నర్ మునిమనువడు
ఇక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా బయటికి వెళ్తున్నారు. కొందరు బీజేపీలో చేరుతుండగా, మరికొందరు సొంత కుంపట్లు పెట్టుకుంటున్నారు. ఇందులో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ ఒకరు. ఈయన 2015 ఆగస్టులో పార్టీని వీడారు. అయితే తన సూచన మేరకు హిమంతను కొద్ది కాలం ఆగారని, అయితే పార్టీలో పరిస్థితులను కొలిక్కి తీసుకు రావడంలో సోనియా, రాహుల్ అలసత్వం వహించారని ఆజాద్ విమర్శించారు. శనివారం సీనియర్ జర్నలిస్ట్ బర్ఖా దత్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాల మీద ఆయన తన అనుభవాల్ని, అభిప్రాయాల్ని పంచుకున్నారు.
Karnataka Polls: ఢిల్లీలో మాజీ సీఎం కిరణ్ కుమార్ వరుస భేటీలు.. కర్ణాటక ఎన్నికల్లో కీలక బాధ్యతలు?
‘‘నేను హిమంతకు ఫోన్ చేసి, ఆయన మద్దతుదారులందరితో కలిసి ఢిల్లీకి రావాలని అడిగాను. అప్పటి ముఖ్యమంత్రిని కూడా అలాగే చేయమని చెప్పాను. మేము పరిస్థితిని సమీక్షించాము. హిమంతకు ఎక్కువ మద్దతు ఉంది. ఈ విషయమై అన్ని పరిణామాల గురించి సోనియా గాంధీకి వివరించాను. కానీ రాహుల్ గాంధీతో సంప్రదింపులు జరపమని ఆమె మాకు చెప్పలేదు. అస్సాం వెళ్లే ముందు రాహుల్ గాంధీ నుంచి ఫోన్ వచ్చింది. సీఎంను మార్చేందుకు అస్సాం వెళ్తున్నారా అని ప్రశ్నించారు. అనంతరం మమ్మల్ని వెనక్కి పిలిచారు. ఆ సమయంలో ఆయన పార్టీ అధ్యక్షుడు కాదు” అని కాంగ్రెస్ పార్టీలోని పరిస్థితిని గులాం నబీ ఆజాద్ తెలిపారు.