రాజధాని ఎక్కడికి వెళ్లినా తిరిగి ఇక్కడికే వస్తుంది : పవన్ కళ్యాణ్
జగన్ కు రైతులు ఉగ్రవాదుల్లా కనిపిస్తున్నారా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఒక్క రాజధానికే దిక్కు లేదు...మూడు రాజధానులు కావాలా అని అడిగారు.

జగన్ కు రైతులు ఉగ్రవాదుల్లా కనిపిస్తున్నారా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఒక్క రాజధానికే దిక్కు లేదు…మూడు రాజధానులు కావాలా అని అడిగారు.
జగన్ కు రైతులు ఉగ్రవాదుల్లా కనిపిస్తున్నారా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఒక్క రాజధానికే దిక్కు లేదు…మూడు రాజధానులు కావాలా అని అడిగారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగితే కేసులు పెట్టండి…రాజధాని మార్పు ఎందుకని నిలదీశారు. రాజధాని తరలిపోతుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. వైసీపీని ఢీకొట్టాలంటే జనసేన, బీజేపీ వల్లే సాధ్యం అన్నారు. రాజధాని ఎక్కడికి వెళ్లినా తిరిగి అమరాతికే వస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. 3 రాజధానుల బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం లభించింది. విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా, అమరావతిని శాసన నిర్మాణ రాజధానిగా, కర్నూలును జ్యూడీషియల్ కేపిటల్ గా చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. మూడు రాజధానులపై సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేశారు. అమరావతిని లెజిస్టేటివ్ రాజధానిగా, విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా, కర్నూలును జ్యూడీషియల్ రాజధానిగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తన హయాంలో కర్నూలుకు మేలు చేసే అవకాశం దేవుడు తనకు ఇచ్చినందకు సంతోషపడుతున్నట్లు తెలిపారు.
వీటికి మద్దతు పలకాలని రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క మనిషిని కోరుతున్నట్లు తెలిపారు. న్యాయం చేస్తున్న ప్రభుత్వం మీద రాళ్లు వేయాలని చెప్పి నిర్ణయం చేసుకున్న చంద్రబాబు నాయుడి గారిని కూడా వారి మనసులు మారాలని దేవుడిని ప్రార్థిస్తున్నాని చెప్పారు. అమరావతి ప్రాంతానికి అన్యాయం చేయడం లేదని మరోసారి స్పష్టం చేశారు. మిగిలిన ప్రాంతాలకు కూడా న్యాయం చేస్తున్నామని తెలిపారు.