ఏం చెబుతారు : జగన్ 100 రోజుల పాలనపై పవన్ ప్రెస్ మీట్

జగన్‌ వంద రోజుల పాలనపై పవన్ స్పందించబోతున్నారు. ఇప్పటికే ఇసుక పాలసీపై విమర్శలు గుప్పించిన జనసేనాని... సర్కార్‌పై పోరుకు సిద్ధమతున్నారా? అందులో భాగంగానే

  • Published By: veegamteam ,Published On : September 14, 2019 / 01:52 AM IST
ఏం చెబుతారు : జగన్ 100 రోజుల పాలనపై పవన్ ప్రెస్ మీట్

Updated On : September 14, 2019 / 1:52 AM IST

జగన్‌ వంద రోజుల పాలనపై పవన్ స్పందించబోతున్నారు. ఇప్పటికే ఇసుక పాలసీపై విమర్శలు గుప్పించిన జనసేనాని… సర్కార్‌పై పోరుకు సిద్ధమతున్నారా? అందులో భాగంగానే

జగన్‌ వంద రోజుల పాలనపై పవన్ స్పందించబోతున్నారు. ఇప్పటికే ఇసుక పాలసీపై విమర్శలు గుప్పించిన జనసేనాని… సర్కార్‌పై పోరుకు సిద్ధమతున్నారా? అందులో భాగంగానే మీడియా ముందుకు రాబోతున్నారా? ఇంతకీ ఆయన ఏం మాట్లాడబోతున్నారు? జగన్ పాలన ఎలా ఉందనే విషయంపై తన అభిప్రాయాన్ని శనివారం(సెప్టెంబర్ 14,2019) పవన్ చెప్పబోతున్నారు. ఇప్పటికే పార్టీ నేతలు అభిప్రాయాలు, ప్రజల అభిప్రాయాలతోపాటు… పాలనపై చేయించిన అధ్యయనం రిపోర్టునున కూడా అందుకున్న పవన్… తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టబోతున్నారు.

వైసీపీ ప్రభుత్వంలోని ముఖ్యమైన శాఖల పనితీరుపై పార్టీ నేతలు, నిపుణులతో కూడిన 10 బృందాలతో అధ్యయనం చేయించారు పవన్‌ కల్యాణ్‌. నెల రోజులపాటు అనేక అంశాలపై అధ్యయనం చేసిన ఈ బృందాలు జగన్ పాలనపై పవన్‌కు రిపోర్టులు కూడా ఇచ్చాయి. ఈ నివేదికల్లోని ముఖ్యాంశాల ఆధారంగా మీడియా ముందుకు రాబోతున్నారు జనసేనాని. ఉదయం 11 గంటలకు అమరావతిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో… జగన్‌ పాలనపై తన అభిప్రాయం ఏంటో ప్రకటించనున్నారు.

పవన్ ముఖ్యంగా 9 అంశాలపై స్పందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజధాని నిర్మాణం, ఇసుక పాలసీ, పోలవరం, రివర్స్ టెండరింగ్, గ్రామ వాలంటీర్ల వ్యవస్థ, మద్యపాన నిషేధం, ప్రజావేదిక కూల్చివేత వంటి పలు కీలక అంశాలపై స్పందించనున్నారు. తాజాగా.. మంగళగిరి సమీపంలోని నవులూరు గ్రామంలోని ప్రభుత్వ ఇసుక రీచ్‌ను పరిశీలించిన పవన్… ఇసుక పాలసీపై తన అభిప్రాయాన్ని చెప్పేశారు. ఇసుక పాలసీలో జగన్ చెప్పినంత పారదర్శకత లేదన్న ఆయన.. అధికార పార్టీని విమర్శించడమే జనసేన పని కాదన్నారు 

రాజధాని మార్పు వార్తలు, ఇసుక పాలసీపై ఇప్పటికే సర్కార్‌పై విమర్శనాస్త్రాలు సంధించిన పవన్‌ కల్యాణ్‌..  ప్రభుత్వ 100 రోజుల పాలనపై ఎలాంటి విమర్శలు ఎక్కుపెడతారన్నది ఏపీ పాలిటిక్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. జగన్‌ సర్కార్‌పై పోరుబాటకే పవన్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.