రాజధాని రైతులపై పోలీసు కేసులు

  • Published By: chvmurthy ,Published On : December 21, 2019 / 02:48 PM IST
రాజధాని రైతులపై పోలీసు కేసులు

Updated On : December 21, 2019 / 2:48 PM IST

ఏపీ రాజధాని అమరావతిని అక్కడి నుంచి తరలించటాన్ని నిరసిస్తూ ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు కేసులు నమోదు చేసారు. శుక్రవారం సాయంత్రం నుంచి  రైతులు చేస్తున్న ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. అమరావతి ప్రాంతంలో సెక్షన్ 144, 30  పోలీసు యాక్ట్ ను పోలీసులు అమలు చేస్తున్నారు.  పంచాయతీ ఆఫీసులకు నల్లరంగు వెయ్యటం, నీటి సరఫరా నిలిపివేయటం, వెలగపూడి సచివాలయం లోకి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించారనే కారణాలతో రాజధాని గ్రామాల్లోని పలువురు రైతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

రాజధాని అంశంపై జీఎన్‌రావు కమిటీ  శుక్రవారం, డిసెంబర్ 20న, ఇచ్చిన నివేదిక మరింత ఉద్రిక్తతను పెంచింది. మూడు రాజధానులంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనపై రాజధాని ప్రజలు భగ్గుమంటున్నారు. నాలుగు రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వెలగపూడిలోని గ్రామ పంచాయతీ కార్యాలయానికి వేసిన పార్టీ రంగులను వైసీపీ కార్యకర్తలే తుడిచేస్తున్నారు.

దీంతో కార్యకర్తలకు గ్రామస్తులు మద్దతుగా నిలిచారు. పంచాయతీ ఆఫీసుకి నల్ల రంగు వేయడాన్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే, పోలీసులను తోసేసి మరీ పంచాయతీ ఆఫీసుకి నల్లరంగు వేస్తున్నారు రైతులు. గ్రామస్తులకు మధ్య జరిగిన తోపులాట కారణంగా పోలీసులపై నల్లరంగు పడింది. 

వికేంద్రీకరణ పేరుతో రాజధానిని మార్చడంపై నిరసనగా వెలగపూడిలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. తుళ్లూరులో మహాధర్నా నేపథ్యంలో రైతులు వాహనాలను రోడ్డుకు అడ్డంగా ఉంచారు. దీంతో సచివాలయానికి వెళ్లే మార్గంలో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ నినాదాలు చేస్తున్నారు. 

కాగా…అమరావతిలో సెక్షన్ 144 అమల్లో ఉన్నా నిరసనకారులు గుమిగూడి ఉండడం, పోలీసులతో గొడవపడడం, వాగ్వాదం చేయడం, తోసివేసిన, బ్యారికేడ్లు తోసివేయడం, పడవేయటం. పరిగెత్తుకుంటూ వచ్చిన వాటికి సంభందించిన దృశ్యాలు, సీసీ పుటేజ్ లు, వీడియోలు బాడివొర్న్ కెమెరాల ద్వారా గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి తుళ్ళూరు పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు నమోదు అయ్యాయి.

తుళ్ళూరు లోని నీటి పైపు లైను కు సంబంధించి అక్కడ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగిని భయపెట్టి సెక్రటేరియట్, ఇతర గ్రామాలకు నీటి సరఫరా జరగకుండా ఆపి వేసినందుకు ప్రభుత్వ ఉద్యోగి ఫిర్యాదు మేరకు ఒక కేసు నమోదు చేశారు. మల్కాపురం, రాయపూడి, తుళ్ళూరు, వెలగపూడి గ్రామా పంచాయితీ ఆఫీస్ లలో ప్రభుత్వ ఆస్తులపైన నల్ల రంగు వేసినందుకు కొందరు వ్యక్తులను ఆధారాలను బట్టి పంచాయతీ అధికారులు గుర్తించి ఇచ్చిన ఫిర్యాదుతో మరో మూడు కేసులు నమోదు చేశారు.