పంతం నెగ్గించుకున్న టీడీపీ : ఏపీ శాసనమండలిలో నెగ్గిన రూల్ నెంబర్ 71 తీర్మానం
ఏపీ శాసన మండలిలో టీడీపీ తన పంతం నెగ్గించుకుంది. రూల్ నంబర్ 71పై ఓటింగ్ జరిగింది. దీంతో ఈ రూల్ నంబర్ 71కు అనుకూలంగా 27 మంది, వ్యతిరేకంగా 11 మంది ఓటు వేయగా తటస్థంగా 9 మంది వ్యవహరించారు.

ఏపీ శాసన మండలిలో టీడీపీ తన పంతం నెగ్గించుకుంది. రూల్ నంబర్ 71పై ఓటింగ్ జరిగింది. దీంతో ఈ రూల్ నంబర్ 71కు అనుకూలంగా 27 మంది, వ్యతిరేకంగా 11 మంది ఓటు వేయగా తటస్థంగా 9 మంది వ్యవహరించారు.
ఏపీ శాసన మండలిలో టీడీపీ తన పంతం నెగ్గించుకుంది. రూల్ నంబర్ 71పై చర్చ కోసం ఓటింగ్‌కు పట్టుబట్టింది టీడీపీ. రూల్ నంబర్ 71పై ఓటింగ్ జరిగింది. మూడు రాజధానుల బిల్లుపై చర్చించాలని వైసీపీ కూడా డిమాండ్ చేసింది. ఈ గందరగోళ పరిస్థితిలో ఛైర్మన్ రూల్ 71పై చర్చకు అనుమతించారు. ఆ తర్వాత ఓటింగ్ నిర్వహించారు. దీంతో ఈ రూల్ నంబర్ 71కు అనుకూలంగా 27 మంది, వ్యతిరేకంగా 11 మంది ఓటు వేయగా తటస్థంగా 9 మంది వ్యవహరించారు. అయితే వీరిలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీలు రూల్ నంబర్ 71కు వ్యతిరేకంగా ఓటు వేసినట్లు తెలుస్తోంది. ఈ ఓటింగ్‌లో టీడీపీ విజయం సాధించింది. అనంతరం శాసనమండలి బుధవారానికి వాయిదా పడింది.
ఏపీ శాసనమండలిలో రూల్ 71కు అనుకూలంగా టీడీపీ, వ్యతిరేకంగా వైసీపీ ఓటింగ్ వేసింది. పీడీఎఫ్, బీజేపీ ఎమ్మెల్సీలు తటస్థంగా ఉన్నారు. ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథరెడ్డి టీడీపీకి ఝలక్ ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్సీల పోతుల సునీత, శివనాథరెడ్డి రూల్ 71 వకు వ్యతిరేకంగా ఓటేశారు. రూల్ నెంబర్ 71 పై ఓటింగ్ అనుకూలంగా 27 మంది సభ్యులు, వ్యతిరేకంగా 11 మంది సభ్యులు ఓటింగ్ వేశారు. 9 మంది సభ్యులో తటస్థంగా ఉన్నారు. ఏపీ శాసనమండలిలో రూల్ నెంబర్ 71లో భాగంగా టీడీపీ ఇచ్చిన నోటీస్ పై చర్చ రేపటికి వాయిదా పడింది.
బిల్లును రేపు సెలెక్ట్ కమిటీకి పంపే యోచనలో టీడీపీ ఉండగా, ఎలాగైనా పాస్ చేసుకునే వ్యూహం చేస్తోంది ప్రభుత్వం. సెలక్ట్ కమిటీకి పంపితే జాప్యం జరిగే అవకాశం ఉంది. సెలక్ట్ కమిటీలో నిర్ణయానికి గిరిష్టంగా మూడు నెలల సమయం పట్టే ఛాన్స్ ఉంది. కౌన్సిల్ లో బిల్స్ పాస్ చేసుకునే వ్యూహాన్ని వైసీపీ సిద్ధం చేస్తోంది. సవరణల కోసం బిల్ అసెంబ్లీకి వెళ్లినా ప్రభుత్వం పాస్ చేసుకునే అవకాశం ఉంది. మండలిలో రూల్ నెంబర్ 71 పై చర్చ జరిగింది. రూల్ 71 కింద ఉదయం నుంచి జరుగుతున్న డిస్కషన్ ఓటింగ్ తో ముగిసిందని చెప్పవచ్చు. ఈ ఓటింగ్ లో టీడీపీ విజయం సాధించింది. దాదాపు 27 మంది టీడీపీ సభ్యులు రూల్ 71 చర్చను సమర్థించారు. అదే విధంగా 11 మంది వైసీపీ సభ్యులు వ్యతిరేకించారు. 9 మంది పీడీఎఫ్, బీజేపీకి చెందిన సభ్యులు తటస్థంగా ఉన్నారు.
ఎమ్మెల్సీ పోతుల సునీత, కడప జిల్లాలకు చెందిన శివనాథ్ రెడ్డి టీడీపీకి హ్యాండ్ ఇచ్చారు. వైసీపీకి అనుకూలంగా శాసనమండలిలో వ్యవహరించారు. టీడీపీకి చెందిన డొక్కా మాణిక్యాల వరప్రసాద్ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఈరోజు ఉదయమే ప్రకటించారు. శమంతకమని ఈరోజు శాసనమండలికి హాజరు కాలేదు. ఉత్కంఠభరితంగా ఈ చర్చ చివరి ఓటింగ్ తో ముగిసింది. ఈ ఓటింగ్ లో టీడీపీకి సంబంధించిన ఇద్దరు శాసనమండలి సభ్యులు మాత్రం వైసీపీ వైపు ఫిరాయించారని చెప్పవచ్చు.
పోతుల సునీత, శివనాథ్ రెడ్డి వీరిద్దరూ మొదటి నుంచి కొంత అనుమానంగా ఉన్నారు. చంద్రబాబు..పోతుల సునీతను తన చాంబర్ కు పిలిపించుకుని మాట్లాడారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఎట్టిపరిస్థితుల్లో వైసీపీ వైపు వెళ్లకూడదని చంద్రబాబు కొంత నచ్చచెప్పినప్పటికీ కూడా ఆమె నిర్ణయాన్ని మార్చుకోలేదు. పోతుల సునీత, ఆమె భర్త పోతుల సురేష్ ను పిలిపించి చంద్రబాబు ఎంత కౌన్సిలింగ్ చేసినప్పటికీ కూడా ఓటింగ్ లో వారు వైసీపీ వైపు పాల్గొన్నారు.
కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన నేత, ఆదినారాయణ రెడ్డి సమీప బంధువు అయిన శివనాథ్ రెడ్డి..మొదటి నుంచి కూడా టీడీపీ సభ్యుల వైపే ఉంటూ పార్టీ ఫిరాయించి ఆఖరి నిమిషంలో వైసీపీ పక్షాన చేరడం సభలో ఆసక్తికర పరిణామంగా చెప్పుకోవచ్చు. మరోవైపు ఉదయమే టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యాల వరప్రసాద్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి సభకు హాజరు కాలేదు. టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ శమంతకమని కూడా అనారోగ్యం పేరుతో ఈరోజు శాసనమండలికి హాజరుకాలేదు. ఈనేపథ్యంలో ఉదయం నుంచి కొంత ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి.
మూడు రాజధానులకు అనుకూలంగా బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు …ఈ రెండు బిల్లులను శాసనమండలిలో ఆమోదించాలని ప్రభుత్వం అనుకున్నప్పటికీ ప్రతిపక్ష టీడీపీ మొదటగా ఒక ఎత్తు వేసింది. రూల్ 71 కింద చర్చ జరపాలని గట్టిగా ఫైట్ చేసి దాన్ని చర్చకు పెట్టారు. అయితే అధికార పక్ష మాత్రం బిల్లులను ప్రవేశపెట్టిన తర్వాత చర్చకు సహకరిస్తామని చెప్పి పెట్టడంతో సాయంత్ర వరకు కూడా ఐదు సార్లు వాయిదా పడింది. ప్రభుత్వం చివరకు సభ చెప్పిన విధానానికే తల వగ్గిందని చెప్పవచ్చు.