ఏం జరుగుతోంది : సీఎం జగన్ ను కలిసిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం జగన్, చలమేశ్వర్‌ను శాలువా, జ్ఞాపికతో సాదరంగా సత్కరించారు.
చలమేశ్వర్ వెంట అధికార భాషా సంఘం అధ్యక్షుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు ఉన్నారు. కాగా, గతేడాది జూన్ 11న విజయవాడలో ‘పెద్దల సభలో తెలుగు పెద్ద’ పుస్తకావిష్కరణ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పాటు చలమేశ్వర్ కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే.