టీడీపీదే అధికారం : 130 ఎమ్మెల్యే, 20 ఎంపీ సీట్లు ఖాయం

తిరుమల : ఏపీ ప్రజలు మరోసారి చంద్రబాబుకి పట్టం కట్టబోతున్నారని టీడీపీ నేత, మంత్రి కొల్లు రవీంద్ర జోస్యం చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే ఈ ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తాయని అన్నారు. 130కి పైగా అసెంబ్లీ, 20కిపైగా లోక్ సభ స్థానాలను టీడీపీ గెలుస్తుందన్నారు. ఆదివారం(ఏప్రిల్ 14,2019) కొల్లు రవీంద్ర తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమన్నారు. చంద్రబాబు పాలనను ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.
అన్ని వర్గాల ప్రజలకు చంద్రబాబు న్యాయం చేశారని కొల్లు రవీంద్ర అన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని అన్నారు. చంద్రబాబు పాలనపై ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. పోలింగ్ శాతం పెరగడానికి కూడా చంద్రబాబుపై ఉన్న అభిమానమే కారణం అన్నారు. ఈ ఐదేళ్లు రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు చాలా కష్టపడ్డారని కొల్లు రవీంద్ర చెప్పారు. అన్ని వర్గాలకు న్యాయం చేసి చక్కటి పరిపాలన అందించారని ప్రశంసించారు. చంద్రబాబు నాయకత్వంలో మరింత అభివృద్ధి జరుగుతుందని, రాష్ట్రం మరింత ముందుకెళుతుందని కొల్లు రవీంద్ర అన్నారు.