ఏం తిట్లబ్బా అవీ : మరోసారి బాబుపై విజయసాయి సెటైర్లు

ఏం తిట్లబ్బా అవీ : మరోసారి బాబుపై విజయసాయి సెటైర్లు

Updated On : April 27, 2019 / 10:21 AM IST

ఆంధ్రప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సాఆర్‌సీపీ రాజ్యసభ సభ్యుడైన విజయసాయి రెడ్డి  తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. నేరుగా చంద్రబాబును వైజాగో.. ఎర్రగడ్డకో తీసుకెళ్లండంటూ మతిస్థిమితం లేని వ్యక్తితో పోల్చారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మాట అటుంచి కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో బాబు పాల్గొన్నారు. 

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటకలోని మాండ్య ప్రాంతంలో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడకు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 150-170 సీట్లు మించి రావని సర్వేల్లే తేలిందని చంద్రబాబు అన్నారు. 

ఈ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శించారు. కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రల్లో ఓటర్లను చంద్రబాబు చైతన్యవంతం చేయబట్టే పోలింగు శాతం పెరిగిందని చంద్రబాబు తనకు తానే చెప్పుకున్నారంటూ.. ఎద్దేవా చేశారు. దాంతో పాటు దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో కూడా పర్యటించి ఓటర్లను రఫ్పాడిస్తారని ఆయన అందులో పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసిన రెండు వారాల్లోనే బాబుకు ఇంత ముదరిపోయిందేమిటని ప్రశ్నించారు. ‘ఏ వైజాగో, ఎర్రగడ్డకో తీసుకెళ్లండయ్యా..’ అంటూ సెటైర్లు విసిరారు.