Tirumala : మే 5 నుంచి శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులకు అనుమతి-టీటీడీ
తిరుమల శ్రీవారి భక్తులకు స్లాట్ బుకింగ్ విధానం, నడకదారి భక్తులుకు టోకేన్లు జారిని త్వరలోనే ప్రారంభిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈరోజు జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.

Ttd Board Meeting
Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు స్లాట్ బుకింగ్ విధానం, నడకదారి భక్తులుకు టోకేన్లు జారిని త్వరలోనే ప్రారంభిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈరోజు జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
మహారాష్ట్రలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి అక్కడి ప్రభుత్వం 10 ఎకరాల భూమి కేటాయించిందని త్వరలోనే భూమి పూజ నిర్వహించి ఆలయ నిర్మాణం ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన రూ. 500 కోట్ల విలువైన భూమిలో ఆలయం నిర్మించటానికి రేమాండ్స్ అధినేత గౌతమ్ సింఘానియా ముందుకు వచ్చారని వైవీసుబ్బారెడ్డి చెప్పారు.
సామాన్య భక్తులుకు తర్వతరగతిన దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని … మే 5వ తేదీనుంచి శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులను అనుమతిస్తామని ఆయన తెలిపారు. శ్రీవారి ఆలయంలో రూ. 3.61 కోట్ల రూపాయలతో రెండు బంగారు సింహసనాలు తయార చేయిస్తున్నామని…పద్మావతి మెడికల్ కాలేజిలో రూ. 21 కోట్ల వ్యయంతో నిర్మాణాలు చేపట్టన్నన్నట్లు ఆయన చెప్పారు.
శ్రీనివాస సేతు మొదటి దశ పనులు పూర్తి అయ్యాయని…మే 5వ తేది సీయం జగన్ చేతులు మీదుగా ప్రారంభిస్తామని సుబ్బారెడ్డి చెప్పారు. శ్రీనివాస సేతు 2వ దశ పనులుకు రూ.100 కోట్లు కేటాయించామని…. మార్చి 2023 కి పనులు పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ఐఐటి నిపుణలు సూచన మేరకు ఘాట్ రోడ్డులో పటిష్ట చర్యలు తీసుకోవడానికి రెండు దశలలో రూ.36 కోట్లు కేటాయించారు.
Also Read : Temple in Railway station: రైల్వే స్టేషన్లో ఆలయం: తొలగిస్తే ప్రాణత్యాగానికి సిద్ధమన్న హిందూ సంఘాల ప్రతినిధులు
వసతి గదులు మరమత్తులుకు రూ. 19 కోట్లు, బాలాజినగర్లో 2.86 ఏకరాల స్థలంలో ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం చేపట్టనున్నారు. వస్తూ రుపేణా విరాళాలు అందించిన భక్తులుకు ప్రివిలేజస్ ఇవ్వాలని…. ఆస్థాన సిద్దాంతిగా వేంకట కృష్ణ పూర్ణ సిద్దాంతిని నియమించారు. తిరుమలలోని 737 ఉద్యోగులు క్వార్టర్స్ కు మరమత్తులు చేయించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. త్వరలోనే టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్ధలాలు కేటాయింపు చేస్తామని సుబ్బారెడ్డి తెలిపారు.