Samatha Murthy Statue : దుష్టగ్రహ బాధా విముక్తి కోసం శ్రీనాథ సంహేష్టి.. సోమ, మంగళవారాల్లో ప్రత్యేక కార్యక్రమాలు
సోమవారం శ్రీ కృష్ణ అష్టోత్తర శతనామ పూజ జరుగనుంది. ఉదయం ప్రవచనాలు, దుష్ట నివారణకై శ్రీ సుదర్శన ఇష్టి చేయనున్నారు. ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా గ్రహణం వీడడం లేదు...

statue-of-equality-samantha-murthy-statue-celebration-february-07th-and-08th-schedule
Statue of Equality : జై శ్రీమన్నారాయణ నామంతో ఆధ్యాత్మిక నగరి ముచ్చింతల్ మార్మోగుతోంది. అష్టాక్షరీ మంత్రంతో పులకరించిపోతుంది. దేశం నలుమూలల నుంచి వచ్చిన 5 వేల మంది రుత్విజుల ఆధ్వర్యంలో శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు నిర్విఘ్నంగా, వైభవంగా కొనసాగుతోంది. సమతామూర్తి సహస్రాబ్ది ఉత్సవాలు ఐదో రోజు కన్నులపండువగా కొనసాగుతున్నాయి. త్రిదండి చిన్న జీయర్ స్వామి నేతృత్వంలో వేలాది మంది పండితులు క్రతువును నిర్వహిస్తున్నారు. మహాక్రతువుతో ముచ్చింతల్ పులకిస్తోంది. ఓం నమో నారాయణాయ…అష్టాక్షరీ మంత్రంతో అణువణువూ ప్రతిధ్వనిస్తోంది. భక్తీపారవశ్యంలో మునిగితేలుతున్నారు. వీటిని తిలకించడానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. హోమా సుగంధ ద్రవ్యాలు వ్యాపిస్తున్నాయి. 12 రోజుల పాటు ఒక్కో ఇష్టిని చేయడం జరుగుతుందని వేద పండితులు వెల్లడించారు.
Read More : Allu Arjun: ప్రమోషన్స్ వివాదం.. బన్నీకి బ్రాండే బ్యాడా?
అందులో భాగంగా 2022, ఫిబ్రవరి 07వ తేదీ సోమవారం, ఫిబ్రవరి 08వ తేదీ మంగళవారం పలు ఇష్టిలు చేయనున్నారు. సోమవారం శ్రీ కృష్ణ అష్టోత్తర శతనామ పూజ జరుగనుంది. ఉదయం ప్రవచనాలు, దుష్ట నివారణకై శ్రీ సుదర్శన ఇష్టి చేయనున్నారు. ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా గ్రహణం వీడడం లేదు. పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనాసురుడి అనేక అనారోగ్య పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందులో భాగంగా మంగళవారం దుష్టగ్రహ బాధ నివారణ శక్తి హోమం నిర్వహించనున్నారు దుష్టగ్రహ బాధా విముక్తి నివారణ కోసం శ్రీనాథ సంహేష్టి, జ్ఞాన జ్ఞాన కృతసర్వ విధాపాప నివారణకై శ్రీమన్నారాయణేష్టి నిర్వహించనున్నారు.
Read More : Lata Mangeshkar: మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో లతామంగేష్కర్ అంత్యక్రియలు
భగవంతుడి మీద ఉన్న నమ్మకమే రక్షిస్తుందని, శరణాగతి వేడితే.. ఇతిబాధలు, అనారోగ్య బాధలు తొలగుతాయని పండితులు వెల్లడిస్తున్నారు. 216 అడుగుల ఎత్తున్న శ్రీమత్ రామానుజా చార్యులను చూడడటానికి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. దీంతో ముచ్చింతల్ ప్రాంతం సందడి సందడిగా మారిపోయింది. శ్రీరామ నగరం దివ్యక్షేత్రంగా మెరిసిపోయింది. సమతా స్ఫూర్తికి నిలువెత్తు రూపమైన రామానుజుల ముకులిత హస్తాల దివ్యరూపం.. లోకార్పణం జరిగింది. వసంత పంచమి సందర్భంగా ప్రధాని మోదీ.. రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేసిన సంగతి తెలిసిందే.