జమ్మూ, వారణాశిలో శ్రీవారి ఆలయాలు

జమ్ముకాశ్మీర్, వారణాసిలో శ్రీవారి ఆలయాలను నిర్మించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. ఇందుకోసం జమ్ముకశ్మీర్ ప్రభుత్వం 7 స్థలాలను ఎంపిక చేయగా.. అందులో 4 స్థలాలు ఆలయ నిర్మాణానికి అనువుగా ఉన్నాయని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. స్థల పరిశీలన కోసం ఫిబ్రవరి 7, శుక్రవారం ఆలయ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి , ఇతర ఉన్నతాధికారులు జమ్ము బయలుదేరి వెళుతున్నారు. స్థలం ఎంపిక పూర్తైన తర్వాత డిజైన్లు రూపొందించి ఏడాదిలోపు ఆలయ పనులు ప్రారంభిస్తామని ఈవో తెలిపారు.
నకిలీ వెబ్ సైట్ల ద్వారా భక్తులను మోసం చేస్తున్న 19 నకిలీ వెబ్ సైట్లను గుర్తించినట్లు ఈవో చెప్పారు. శుక్రవారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో మాట్లాడుతూ ..శ్రీవారి భక్తులు టీటీడీ వెబ్‌సైట్‌ను కాకుండా నకిలీ వెబ్‌సైట్‌లను ఆశ్రయిస్తున్నారని..నకిలీ వెబ్‌సైట్లు రూ.300 దర్శనం టికెట్లను రూ.1500 వరకు వసూలు చేస్తున్నాయని ఆయన వివరించారు.
భక్తులకు టికెట్లు బుక్ చేయకుండానే కొన్ని వెబ్‌సైట్లు మోసం చేస్తున్నాయి
. నకిలీ వెబ్‌సైట్లపై భక్తులకు అవగాహన కోసం టీటీడీ చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు.
నకిలీ వెబ్‌సైట్లను గుర్తించి చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో మే నెలలో లభించే ఆర్జిత సేవా టికెట్లను ఈవో శుక్రవారం విడుదల చేశారు. భక్తులకు 72,773 ఆర్జిత సేవా టికెట్లు
అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్ డిప్ విధానంలో 11,498 టికెట్లు ఉన్నాయి.
సుప్రభాతం- 8,143
తోమాల సేవా-120
అర్చన-120
అష్టదళ పాదపద్మారాధన-240,
నిజపాద దర్శనం టికెట్లు-2,875
ఆన్‌లైన్ జనరల్ కేటగిరిలో 61,275
ఆర్జిత సేవా టికెట్లు
విశేషపూజ-2000
కల్యాణోత్సవం-14,725
ఊంజళ్ సేవా-4,650
ఆర్జిత బ్రహ్మోత్సవం-7,700
వసంతోత్సవం-15,400
సహస్ర దీపాలంకార సేవా ఆర్జిత టికెట్లు-16,800 భక్తులకుఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి.