రాహుల్ హాఫ్ సెంచరీ, పేలవమైన బ్యాటింగ్‌తో భారత్

Team India: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా మరోసారి పేలవమైన ప్రదర్శన కనబరిచింది. ఈ క్రమంలో ఆసీస్‌కు 162పరుగుల టార్గెట్ నిర్దేశించింది. చివర్లో బ్యాటింగ్ కు దిగిన రవీంద్ర జడేజా(44: 23 బంతుల్లో 5ఫోర్లు, సిక్సు)లతో జట్టును ఆదుకోవడంతో నామమాత్రపు స్కోరు నమోదు చేయగలిగింది.
శిఖర్ ధావన్(1), విరాట్ కోహ్లీ(9), సంజూ శాంసన్(23), మనీశ్ పాండే(2), హార్దిక్ పాండ్యా(16), వాషింగ్టన్ సుందర్(7), దీపక్ చాహర్(0)లు ఆడగా నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి క్రీజులో చాహర్, జడేజాలు ఉండి ఇన్నింగ్స్ పూర్తి చేయగలిగారు. మిచెల్ స్టార్క్ 2, హెన్రిక్స్ 3వికెట్లు పడగొట్టగా ఆడం జంపా, మిచెల్ స్వెప్సన్ తలో వికెట్ దక్కించుకున్నారు.