పాకిస్థాన్ బ్యాటర్ల వెన్ను విరిచిన కుల్దీప్ యాదవ్.. టపాటపా పడిపోయిన వికెట్లు..

జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, ఆక్షర్ పటేల్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

పాకిస్థాన్ బ్యాటర్ల వెన్ను విరిచిన కుల్దీప్ యాదవ్.. టపాటపా పడిపోయిన వికెట్లు..

Pic: @BCCI

Updated On : September 28, 2025 / 10:05 PM IST

Asia Cup 2025: ఆసియా కప్ 2025లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతోన్న ఫైనల్‌ మ్యాచ్‌లో 19.1 ఓవర్లకే 146 పరుగులకు పాకిస్థాన్‌ ఆలౌట్ అయింది. టాస్‌ గెలిచిన భారత్‌ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే.

కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌కు పాక్‌ బ్యాటర్లు క్రీజులో ఎక్కువ సేపు ఉండలేకపోయారు. కుల్దీప్‌ నాలుగు వికెట్లు తీశాడు.

Also Read: 3 మార్పులతో ఫైనల్‌ బరిలోకి దిగిన భారత్‌.. సూర్యకుమార్‌ యాదవ్‌ ఏమన్నాడంటే?

పాకిస్థాన్ బౌలర్లలో సహిబ్‌జాదా ఫర్హాన్ 57, ఫఖర్ జమాన్ 46, సైమ్ ఆయబ్ 14, మొహమ్మద్ హరిస్ 0, సల్మాన్ అఘా 8, హుస్సేన్ తలాత్ 1, మొహమ్మద్ నవాజ్ 6, షాహీన్ ఆఫ్రిదీ 0, ఫాహీమ్ అష్రఫ్ 0, హరిస్ రౌఫ్ 6, అబ్రార్ అహ్మద్ 1 (నాటౌట్) పరుగులు తీశారు.

భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, ఆక్షర్ పటేల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. కాగా, 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో భారత్‌, పాకిస్థాన్ ఫైనల్‌లో తలపడుతుండడం ఇదే తొలిసారి.