Babar Azam: విరాట్ కోహ్లీని చూసి మా బ్యాట్స్‌మెన్ నేర్చుకోవాలి: పాకిస్థాన్ సారథి బాబర్ అజాం

బాబర్ అజాం మాట్లాడుతూ... ‘‘భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతున్నప్పుడు తప్పకుండా అదనంగా ఒత్తిడి ఉంటుంది. కోహ్లీ చాలా గొప్ప ఆటగాడు.. టాప్ ఆర్డర్ వికెట్లు కుప్పకూలినా ఒత్తిడిని జయించి ఆడతాడు. మ్యాచ్ జరుగుతున్న తీరునే మార్చేస్తాడు’’ అని చెప్పాడు. ఇంతకు ముందు కోహ్లీ ఆటలో ఎన్నో ఇబ్బందులు పడ్డాడని, ఈ మ్యాచులో మాత్రం బాగా ఆడాడని బాబర్ అజాం తెలిపాడు. ఇటువంటి మ్యాచులు గెలిస్తే వ్యక్తిగతంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుందని చెప్పాడు.

Babar Azam: విరాట్ కోహ్లీని చూసి మా బ్యాట్స్‌మెన్ నేర్చుకోవాలి: పాకిస్థాన్ సారథి బాబర్ అజాం

Babar Azam

Updated On : October 24, 2022 / 7:35 AM IST

Babar Azam: తీవ్ర ఒత్తిడిని ఎలా ఎదుర్కొని ఆడాలో భారత క్రికెటర్ విరాట్ కోహ్లీని చూసి నేర్చుకోవాలని తమ బ్యాట్స్‌మెన్ కు పాకిస్థాన్ సారథి బాబర్ అజాం చెప్పాడు. ఆస్ట్రేలియాలో జరుగుతోన్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా నిన్న పాకిస్థాన్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ధాటిగా ఆడిన తీరుపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

దీనిపై బాబర్ అజాం మాట్లాడుతూ… ‘‘భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతున్నప్పుడు తప్పకుండా అదనంగా ఒత్తిడి ఉంటుంది. కోహ్లీ చాలా గొప్ప ఆటగాడు.. టాప్ ఆర్డర్ వికెట్లు కుప్పకూలినా ఒత్తిడిని జయించి ఆడతాడు. మ్యాచ్ జరుగుతున్న తీరునే మార్చేస్తాడు’’ అని చెప్పాడు. ఇంతకు ముందు కోహ్లీ ఆటలో ఎన్నో ఇబ్బందులు పడ్డాడని, ఈ మ్యాచులో మాత్రం బాగా ఆడాడని బాబర్ అజాం తెలిపాడు.

ఇటువంటి మ్యాచులు గెలిస్తే వ్యక్తిగతంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుందని చెప్పాడు. కాగా, నిన్నటి మ్యాచును కోహ్లీ గెలిపించిన తీరుపై పలువురు క్రికెటర్లు ప్రశంసల జల్లు కురిపించారు. కోహ్లీ మళ్ళీ తనను తాను నిరూపించుకున్నాడని అభినందించారు. తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్ తోనే సమాధానం చెప్పాడని అంటున్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..