Champions Trophy 2025 : వ‌ర్షం కార‌ణంగా ఆస్ట్రేలియా, ద‌క్షిణాఫ్రికా మ్యాచ్ ర‌ద్దు అయితే.. గ్రూప్‌-బిలో సెమీస్ రేసు ఎలా ఉండ‌నుందంటే?

ఆస్ట్రేలియా, ద‌క్షిణాప్రికా మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు అయితే..

Champions Trophy 2025 : వ‌ర్షం కార‌ణంగా ఆస్ట్రేలియా, ద‌క్షిణాఫ్రికా మ్యాచ్ ర‌ద్దు అయితే.. గ్రూప్‌-బిలో సెమీస్ రేసు ఎలా ఉండ‌నుందంటే?

Champions Trophy 2025 semis scenario What will happen if rain wash out Australia vs South Africa clash

Updated On : February 25, 2025 / 5:41 PM IST

ఛాంపియ‌న్స్ ట్రోఫి 2025లో గ్రూప్‌-ఏలో భార‌త్‌, న్యూజిలాండ్ జ‌ట్లు సెమీస్ చేరుకున్నాయి. అయితే.. గ్రూప్‌-బి నుంచి సెమీస్ కు చేరుకునే ఆ రెండు జ‌ట్లు ఏవో ఇంకా తేల‌లేదు. ప్ర‌స్తుతం ద‌క్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జ‌ట్లు చెరో మ్యాచ్‌లో విజ‌యం సాధించి తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. రెండు జ‌ట్లు కూడా రెండు పాయింట్ల‌తో స‌మానంగా ఉన్నా కూడా ద‌క్షిణాఫ్రికా నెట్‌ర‌న్‌రేట్ (+2.140), ఆస్ట్రేలియా నెట్ ర‌న్‌రేట్ (+0.475) కంటే అధికంగా ఉండ‌డంతో అగ్ర‌స్థానంలో ఉంది.

రావ‌ల్పిండి వేదిక‌గా ఆస్ట్రేలియా, ద‌క్షిణాఫ్రికా మంగ‌ళ‌వారం త‌ల‌ప‌డుతున్నాయి. అయితే.. ఈ కీల‌క మ్యాచ్ ఇంకా ప్రారంభం కాలేదు. వ‌ర్షం కార‌ణంగా టాస్ వాయిదా ప‌డింది. వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నా ప్ర‌కారం మ్యాచ్ స‌మ‌యంలో దాదాపు 64 శాతం వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంది. ఈ క్ర‌మంలో వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్ ర‌ద్దు అయితే.. ప‌రిస్థితి ఏంటి? గ్రూప్‌-బిలో సెమీస్ స‌మీక‌ర‌ణాలు ఎలా మారుతాయో ఓ సారి చూద్దాం..

Champions Trophy 2025 points table : అగ్ర‌స్థాన మురిపం ఒక్క‌రోజే.. మ‌ళ్లీ రెండో స్థానానికి ప‌డిపోయిన భార‌త్.. రెండు మ్యాచ్‌లు గెలిచినా కూడా..

వ‌ర్షం కార‌ణం మ్యాచ్ ర‌ద్దు అయితే.. ఇరు జ‌ట్ల‌కు చెరో పాయింట్‌ను కేటాయిస్తారు. అప్పుడు కూడా పాయింట్ల ప‌ట్టిక‌లో ఎలాంటి మార్పు ఉండ‌దు.

సెమీస్ రేసు ఆస‌క్తిక‌రం..

ద‌క్షిణాఫ్రికా త‌మ చివ‌రి లీగ్ మ్యాచ్‌లో గెలిస్తే సెమీస్ చేరుకునేందుకు చాలా మంచి స్థితిలో ఉంటుంది. ఎందుకంటే ఆ జ‌ట్టు నెట్ ర‌న్ రేటు చాలా బాగుంది. అదే స‌మ‌యంలో ఆస్ట్రేలియా సైతం చివ‌రి మ్యాచ్‌లో గెలిస్తే అప్పుడు ఇంగ్లాండ్‌, అఫ్గానిస్తాన్‌లు టోర్నీ నుంచి నిష్ర్క‌మిస్తాయి. ఆస్ట్రేలియా, ద‌క్షిణాఫ్రికా లు సెమీస్ చేరుకుంటాయి.

ప్ర‌స్తుతం ఒక్కొ మ్యాచ్‌లో ఓడిన ఇంగ్లాండ్, అఫ్గానిస్తాన్‌ల ఖాతాలో ఒక్క పాయింట్ కూడా లేదు. అయితే.. ఈ రెండు జట్లు కూడా చెరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇంగ్లాండ్ త‌మ చివ‌రి రెండు మ్యాచ్‌ల్లో ద‌క్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్ ఓడిస్తే అప్పుడు ఆ జ‌ట్టు ఖాతాలో నాలుగు పాయింట్లు ఉంటాయి. అఫ్గానిస్థాన్ త‌మ చివ‌రి రెండు మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాను ఓడిస్తే నాలుగు పాయింట్ల‌ను సాధించ‌వ‌చ్చు. అప్పుడు ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్ర్క‌మిస్తుంది.

WPL 2025 : సూప‌ర్ ఓవ‌ర్‌లో ఓట‌మి.. ఎల్లీస్ పెర్రీకి క్ష‌మాప‌ణ‌లు చెబుతూ భావోద్వేగానికి లోనైన స్మృతి మంధాన‌.. బాధ‌గా ఉంది..

కాబ‌ట్టి ఆస్ట్రేలియా, ద‌క్షిణాఫ్రికా మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు అయితే.. గ్రూప్‌-బిలో మిగిలిన మ్యాచ్‌లు కీల‌కంగా మారుతాయి. అఫ్గానిస్థాన్‌, ఇంగ్లాండ్‌లు త‌మ చివ‌రి రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే అప్పుడు ద‌క్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాల‌లో ఒక జ‌ట్టు మాత్ర‌మే సెమీస్‌కు చేరుకుంటుంది.