CSKvKKR:సొంతగడ్డపై చెన్నై మరో విజయం

సొంతగడ్డపై జరిగిన పోరులో చెన్నై మరో సారి ఘన విజయాన్ని అందుకుంది. చెపాక్ స్టేడియంలో చేధనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ముందుగా కోల్ కతాను 108 పరుగులకు కట్టడి చేసింది.
టార్గెట్ చేదించే దిశగా బ్యాటింగ్ కు దిగిన షేన్ వాట్సన్(17; 9 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సు), ఫాఫ్ డుప్లెసిస్(43), సురేశ్ రైనా(14), అంబటి రాయుడు(21), కేదర్ జాదవ్(8) పరుగులతో విజయాన్ని అందుకున్నారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ ఆరంభం నుంచి చెన్నై ఘోరంగా కట్టడి చేయడంతో ఏడుగురు బ్యాట్స్ మన్ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. కేవలం ఆండ్రీ రస్సెల్(50), రాబిన్ ఊతప్ప(11), దినేశ్ కార్తీక్(19) మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేయగలిగారు. క్రిస్ లిన్(0), సునీల్ నరైన్(6), నితీశ్ రానా(0), శుభ్ మాన్ గిల్(9), పీయూశ్ చావ్లా(8), కుల్దీప్ యాదవ్(0), ప్రసిద్ధ్ కృష్ణ(0), హ్యారీ గర్నే(1)లు చిత్తుగా ఓటమికి గురైయ్యారు.