మనం మనుషులం.. తప్పులనేవి సహజం: గంగూలీ

కోట్లాది మందినుంచి 11 మంది సభ్యుల జట్టులోకి ఎంపిక కావడం మామూలు విషయం కాదు. ఎవరో ఒకరిద్దరు మినహాయించి క్రికెటర్లంతా మంచివాళ్లే. క్రికెటర్లు యంత్రాలు కాదు. వాళ్లూ మనుషులే. తప్పులు చేయడం మానవ సహజం.

మనం మనుషులం.. తప్పులనేవి సహజం: గంగూలీ

Ganguly

కోట్లాది మందినుంచి 11 మంది సభ్యుల జట్టులోకి ఎంపిక కావడం మామూలు విషయం కాదు. ఎవరో ఒకరిద్దరు మినహాయించి క్రికెటర్లంతా మంచివాళ్లే. క్రికెటర్లు యంత్రాలు కాదు. వాళ్లూ మనుషులే. తప్పులు చేయడం మానవ సహజం.

పాండ్యా, రాహుల్‌ల విషయంపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందించాడు.  జీవితంలో ప్రతి ఒక్కరు ఏదో ఓ దశలో తప్పులు చేస్తుంటారని, సరిదిద్దుకుని ముందుకెళ్లాల్సిందేనని వ్యాఖ్యానించాడు. ‘కోట్లాది మందినుంచి 11 మంది సభ్యుల జట్టులోకి ఎంపిక కావడం మామూలు విషయం కాదు. ఎవరో ఒకరిద్దరు మినహాయించి క్రికెటర్లంతా మంచివాళ్లే. క్రికెటర్లు యంత్రాలు కాదు. వాళ్లూ మనుషులే. తప్పులు చేయడం మానవ సహజం. ఈ ఘటన పట్ల హార్దిక్, రాహుల్ ఇప్పటికే చాలా కుమిలిపోతున్నారు. మధ్య తరగతి స్థాయి నుంచి వచ్చిన వాళ్లు ఎంతో పోరాటం చేస్తేనే ఈ స్థాయికి వస్తారు. జరిగింది చాలు ఇక్కడితే వదిలేస్తే బాగుంటుంది. 

‘ఈ తరం క్రికెటర్లు చాలా విధేయులుగా ఉంటారు. చాలా అణుకువగా, గౌరవంగా మసలుకుంటారు. వ్యక్తిగతంగా చాలా మందితో నాకు పరిచయాలు ఉన్నాయి. విరాట్‌ను చూడండి. అందరికీ ఆదర్శప్రాయుడుగా ఉంటాడు. భారత్ క్రికెటర్లు ప్రతి తరంలో అందరినీ అలరించే, ఆకట్టుకునే క్రికెటర్లను అందిస్తోంది. ఒకప్పుడు గవాస్కర్, తర్వాత సచిన్. వాళ్ల తర్వాత కోహ్లీ రూపంలో గొప్ప క్రికెటర్ మనకు లభించాడు. కోహ్లీ అయితే యువతరానికి ఆదర్శంగా నిలుస్తున్నాడు’ అంటూ ప్రసంగించాడు. 

తాను ఆ ఎపిసోడ్‌ను చూడలేదని చెప్పిన గంగూలీ ఇలా పబ్లిక్ ప్లాట్ ఫాంలపై మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని సూచించాడు. బాలీవుడ్ మూవీ అయిన ’22 యార్డ్స్’  సినిమా ట్రైలర్ లాంచా కార్యక్రమానికి హాజరైన గంగూలీ ఇలా వ్యాఖ్యానించారు. ఆయనతో పాటుగా వరుణ్ సోబ్తీ, గీతికా త్యాగి, చైతి ఘోశాల్, డైరక్టర్ మిథాలీ ఘోశాల్‌లు హాజరైయ్యారు.