T20 World Cup 2021: నిద్రమాత్రలు ఇస్తేనే పాకిస్తాన్ గెలుస్తోంది – షోయబ్ అక్తర్
ఇండియాతో మ్యాచ్ అనగానే ఎక్కడలేని ఊహాగానాలన్నీ వినిపిస్తుంటాయి. వీటితో పాటుగా ప్రముఖులు ఇచ్చే సూచనలు గేమ్‌పై భారీ హైప్ క్రియేట్ చేస్తుంటాయి.

Shoib Akthar
T20 World Cup 2021: ఇండియాతో మ్యాచ్ అనగానే ఎక్కడలేని ఊహాగానాలన్నీ వినిపిస్తుంటాయి. వీటితో పాటుగా ప్రముఖులు ఇచ్చే సూచనలు గేమ్‌పై భారీ హైప్ క్రియేట్ చేస్తుంటాయి. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ తమ జట్టుకు సరదాగా సలహాలు ఇచ్చారు.
బాబర్ అజామ్ నేతృత్వంలో జరుగుతున్న మ్యాచ్ గెలవాలంటుే మూడు విషయాలు గుర్తుంచుకోవాలని చెప్పాడు. మ్యాచ్ కు ముందు టీమిండియాకు నిద్రమాత్రలు ఇవ్వాలని చెప్పాడు. మరొకటి విరాట్ కోహ్లీని ఇన్‌స్టాగ్రామ్ 2..రోజుల పాటు దూరంగా ఉంచాలని అన్నాడు. దాంతో పాటుగా ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ చేయకుండా చూడాలని చెప్పాడు.
సరదాగా పాకిస్తాన్ టీంకు సలహాలిచ్చిన షోయబ్ అక్తర్.. విలువైన సూచనలు సైతం ఇచ్చాడు.
ఓపెనర్ల కోసం డాట్ బాల్స్ వదిలేస్తూ.. పేస్ తో ఇన్నింగ్స్ కంటిన్యూ చేయాలని చెప్పాడు. ఇన్నింగ్స్ కు శుభారంభాన్ని నమోదు చేస్తే.. తొలి ఐదారు ఓవర్ల కంటే ముందే స్ట్రైక్ రేట్ పెంచుకోవాలి.
……………………………………….: పాకిస్తాన్ టాస్ గెలిస్తే.. ఆ లెక్క సరైనట్లే
పాకిస్తాన్ బౌలర్లకు కూడా సలహాలు అందాయి. ప్రత్యర్థి జట్టును కట్టడి చేసి తక్కువ స్కోరు నమోదు చేసేలా చూడాలని, బౌలర్లు వికెట్లు పడగొట్టడమే టార్గెట్ చేసుకోవాలని చెప్పాడు.
విరాట్ కోహ్లీ నేతృత్వంలో టీమిండియా దాయాది జట్టు పాకిస్తాన్ తో తలపడేందుకు రెడీ అయింది. దుబాయ్ లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఇరు జట్లు ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2021లో తమ తొలి మ్యాచ్ ను ఆడేందుకు రెడీ అయ్యారు.