Hardik pandya : కొత్త ఏడాదిలో అదిరిపోయే వీడియో షేర్ చేసిన హార్దిక్ పాండ్య‌.. దేనికి సంకేతం ఇది..!

టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్య కొత్త సంవ‌త్స‌రంలో త‌న అభిమానుల‌కు శుభ‌వార్త అందించాడు.

Hardik pandya : కొత్త ఏడాదిలో అదిరిపోయే వీడియో షేర్ చేసిన హార్దిక్ పాండ్య‌.. దేనికి సంకేతం ఇది..!

Hardik pandya gym video

Hardik pandya gym video : టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్య కొత్త సంవ‌త్స‌రంలో త‌న అభిమానుల‌కు శుభ‌వార్త అందించాడు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మ్యాచులో పాండ్య గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం గాయం నుంచి కోలుకుంటున్న పాండ్య‌ గ‌త కొంత‌కాలంగా ఆట‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్నాడు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు అత‌డి ఫిట్‌నెస్ పై ఎలాంటి అప్‌డేట్ లు లేవు. అయితే.. కొత్త ఏడాదిలో అదిరిపోయే వీడియోను పంచుకున్నాడు.

న్యూ ఇయర్ సందర్భంగా జిమ్‌లో చెమటలు పట్టిస్తున్న వీడియోను పంచుకున్నాడు. ఇందులో రకరకాల కసరత్తులను అత‌డు చేస్తూ కనిపిస్తున్నాడు. వీడియోలో.. పాండ్యా జిమ్‌లో వెయిట్ ట్రైనింగ్, స్ట్రెచింగ్ వంటివి చేయడం చూడవచ్చు. ప్ర‌తి రోజు పురోగ‌తిని సాధిస్తున్న‌ట్లు ఆ వీడియోకి క్యాప్ష‌న్ ఇచ్చాడు. ఈ వీడియో ద్వారా పాండ్య‌.. గాయం నుంచి కోలుకున్నాన‌ని, త్వ‌ర‌లోనే మైదానంలో అడుగుపెడుతాన‌నే సంకేతాలను ప‌రోక్షంగా ఇచ్చాడు.

Glenn Maxwell : ఈ షాట్‌ను ఏమ‌ని అనాలో..! బీబీఎల్‌లో వినూత్న షాట్ ఆడిన మాక్స్‌వెల్‌

ఐపీఎల్‌లో ఆడ‌తాడా..!

గాయం కార‌ణంగా ఆసీస్‌తో టీ20 సిరీస్‌, ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు పాండ్య దూరం అయ్యాడు. ఇక జ‌న‌వ‌రి 11 నుంచి అఫ్గానిస్తాన్‌తో జ‌ర‌గ‌నున్న మూడు టీ20 మ్యాచుల సిరీస్‌తో పాటు ఐపీఎల్ 2024 సీజ‌న్‌కు సైతం అత‌డు దూరం అవుతాడ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో వాటి అన్నింటికి చెక్ పెడుతూ పాండ్య వీడియోను పంచుకున్న‌ట్లుగా అర్థ‌మవుతోంది. అఫ్గాన్‌తో సిరీస్‌లో అత‌డు ఆడ‌తాడా లేదా అన్న‌దానిపై స్ప‌ష్ట‌త లేక‌పోయినా.. ఐపీఎల్ నాటికి అత‌డు పూర్తి ఫిట్‌నెస్ సాధించి బ‌రిలోకి దిగే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి.

గుజ‌రాత్ టూ ముంబై..

ఐపీఎల్ 2024 వేలానికి ముందు ట్రేడింగ్ ద్వారా గుజ‌రాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్య‌ను కొనుగోలు చేసింది. అదే స‌మ‌యంలో ముంబై జ‌ట్టును ఐదు సార్లు విజేత‌గా నిలిపిన రోహిత్ శ‌ర్మ‌ను కెప్టెన్సీ నుంచి తొల‌గించింది. హార్దిక్ పాండ్య‌కు ప‌గ్గాలు అప్ప‌గించింది. గుజ‌రాత్ టైటాన్స్ త‌రుపున 31 మ్యాచులు ఆడిన పాండ్య 37.86 స‌గ‌టుతో 833 ప‌రుగులు చేశాడు. 11 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

First Hat trick : క్రికెట్ చ‌రిత్ర‌లో తొలి హ్యాట్రిక్ తీసింది ఈరోజే.. ఆ బౌల‌ర్ ఎవ‌రో మీకు తెలుసా..?

ఐపీఎల్‌లో మొత్తం 123 మ్యాచులు ఆడిన పాండ్య 2309 ప‌రుగులు చేశాడు. ఇందులో 10 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. అత్య‌ధిక స్కోరు 91 ప‌రుగులు. బౌలింగ్‌లో 53 వికెట్లు తీశాడు.