ఐపీఎల్ కంటే ముందుగానే ఫిట్‌గా తయారవుతా: పృథ్వీ షా

చీలమండ గాయంతో టీమిండియాకు దూరమై విశ్రాంతి తీసుకుంటున్న పృథ్వీ షా ఐపీఎల్ కంటే ముందుగానే పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాననే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ కంటే ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో పృథ్వీ గాయపడ్డాడు.

ఐపీఎల్ కంటే ముందుగానే ఫిట్‌గా తయారవుతా: పృథ్వీ షా

Updated On : January 23, 2019 / 7:12 AM IST

చీలమండ గాయంతో టీమిండియాకు దూరమై విశ్రాంతి తీసుకుంటున్న పృథ్వీ షా ఐపీఎల్ కంటే ముందుగానే పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాననే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ కంటే ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో పృథ్వీ గాయపడ్డాడు.

చీలమండ గాయంతో టీమిండియాకు దూరమై విశ్రాంతి తీసుకుంటున్న పృథ్వీ షా ఐపీఎల్ కంటే ముందుగానే పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాననే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ కంటే ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో పృథ్వీ గాయపడ్డాడు. క్యాచ్ అందుకోబోయి వెనుకకు జరిగి పడిపోయిన షా చీలమండకు గాయమవడంతో పర్యటనలో ఏ ఒక్క మ్యాచ్‌లోనూ ఆడలేకపోయాడు. ఇటీవల మీడియాతో మాట్లాడిన షా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్ నాటికి పూర్తి సన్నద్ధతతో సిద్ధమవుతాను. కాలి చీలమండతో పాటు పూర్తి ఫిట్‌నెస్ సాధించాలని కృషి చేస్తున్నాను’ అని పేర్కొన్నాడు. 

ఈ ముంబై ఓపెనర్‌ను ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టులోకి రిటైన్డ్ చేసుకుంది. అడిలైడ్ వేదికగా జరగనున్న తొలి టెస్టుకు ముందు ఆస్ట్రేలియా ఎలెవన్‌తో భారత్ వార్మప్ మ్యాచ్ ఆడింది. అదే మ్యాచ్ ఫీల్డింగ్‌లో గాయానికి గురైన షా మొదటి మ్యాచ్‌కు దూరమవడంతో రెండో మ్యాచ్ కచ్చితంగా ఆడి తీరాలని నిర్ణయించుకున్నాడట. కానీ, ఫిజియోలు గాయం నుంచి ఇంకా కోలుకోలేదని, ఇలాంటి పరిస్థితుల్లో గాయం తీవ్రమయ్యే సూచనలున్నాయని తెలుపడంతో తప్పక ఆగిపోవాల్సి వచ్చిందట. 

‘ఆసీస్‌తో తొలి టెస్టుకు ముందు సిడ్నీ వేదికగా ప్రాక్టీసు మ్యాచ్ ఆడుతున్నాం. మిడ్ వికెట్ ఎదురుగా నిలుచున్నా. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ చేస్తున్నాడు. అనుకోకుండా నా వైపుకు క్యాచ్ వచ్చింది. అందుకునే ప్రయత్నంలో వెనక్కి జరిగి కిందపడ్డా. అలా పడినప్పుడు బరువు మొత్తం ఎడమకాలి మీదపడింది. దీంతో నా కాలు 90డిగ్రీలు అడ్డంగా తిరిగిపోయింది. కోలుకుని రెండో టెస్టు మ్యాచ్ ఆడాలనుకున్నా. ఫిజియోలు వద్దని సూచించారు’

‘ఇది చాలా దురదృష్టకరం. ఆస్ట్రేలియా గడ్డపై ఆడాలనుకున్నా. అక్కడ బౌన్సింగ్ పిచ్‌లపై ఆడటం నాకెంతో ఇష్టం. కానీ, కాలి గాయం కారణంగా ఆడలేకపోయా. పర్యటనలో ఎలా ఆడాలోననే విషయంపై ఎన్నో కలలుకన్నా. భారత్ టెస్టు సిరీస్ గెలిచినందుకు సంతోషంగానే ఉంది’ అని పృథ్వీ షా వెల్లడించాడు.