ఐసీసీ 10 ఇయర్స్ ఛాలెంజ్: అప్పట్లో ధోనీ, ఇప్పుడు కోహ్లీ

అనుభవం గడిస్తున్న కొద్దీ పరిణతి రీత్యా.. పరిస్థితుల ప్రభావంతోనూ మనుషులలో సహజంగానే మార్పు సంభవిస్తుంది. కానీ, ధోనీ ఆటతీరులో 2009 నుంచి ఇప్పటి వరకూ ఏ మాత్రం మార్పు రాలేదంటూ అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)నే చెప్పుకొస్తుంది. ఐసీసీ అధికారిక ట్విట్టర్ ద్వారా 10ఇయర్స్ ఛాలెంజ్ అంటూ 2009 నుంచి 2019వరకూ కొనసాగుతున్న కొందరి ప్లేయర్ల ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఈ కాలగమనంలో మేనరిజంలో జరిగిన మార్పులను గుర్తు చేస్తూ పోస్టు చేసింది. అయితే వీటిలో ధోనీ హిట్టింగ్ స్టైల్‌లో మాత్రం తేడా కనిపించడం లేదు.
The @MRFWorldwide ODI Batting Rankings, #2009vs2019
At number one…?
2009 – @msdhoni
2019 – @imvKohli#10YearChallenge pic.twitter.com/gm3FC9RdE8— ICC (@ICC) January 17, 2019
ధోనీ సిక్సులు బాదడం ఏ మాత్రం తగ్గించలేదని పేర్కొంటూనే చేధనకు మంచి ముగింపునిచ్చే వైఖరి కొనసాగిస్తున్నాడంటూ వెల్లడించింది. ఇంకా 2009వ సంవత్సరంలో టాప్ ప్లేయర్ల జాబితాను ప్రస్తుత టాప్ ప్లేయర్లతో పోల్చి చెప్పింది ఐసీసీ. ఈ క్రమంలోనే అప్పట్లో మహేంద్ర సింగ్ ధోనీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్‌లో టాప్ స్థానంలో ఉండగా ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
#2009vs2019@msdhoni still smashing sixes and finishing chases! ? pic.twitter.com/fv0wvz3rnS
— ICC (@ICC) January 15, 2019
ఈ క్రమంలో బ్యాట్స్‌మెన్‌గా టాప్‌లో ధోనీ నుంచి కోహ్లీకి, బౌలర్‌గా ముత్తయ్య మురళీధరన్ నుంచి కగిసో రబడాకు టాప్ స్థానాలు దక్కాయి. ధోనీ ఆట శైలితో పాటు పాకిస్తాన్ క్రికెటర్ మొహమ్మద్ అమీర్‌ను, న్యూజిలాండ్ క్రికెటర్ రోస్ టేలర్ బ్యాటింగ్ స్టైల్‌లు ఏ మాత్రం మారలేదంటూ కొనియాడింది. లసిత్ మలింగ్ హెయిర్ స్టైల్ ఐకానిక్‌గా ఉండిపోయిందంటూ ప్రశంసలు కురిపించింది.