భారత్‌కు 209 పరుగుల టార్గెట్ ఇచ్చిన న్యూజిలాండ్.. కివీస్ భారీ స్కోరుకి వీరిద్దరే కారణం
ఇండియా, న్యూజిలాండ్ మధ్య రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో 2వ టీ20 జరుగుతోంది.
Team India (Pic: @BCCI Twitter)
- ఇండియా, న్యూజిలాండ్ మధ్య 2వ టీ20
- రచిన్ రవీంద్ర 44 పరుగులు
- మిచెల్ సాంట్నర్ 47 పరుగులు
India vs New Zealand: ఇండియా, న్యూజిలాండ్ మధ్య రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో 2వ టీ20 జరుగుతోంది.
మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర (44 పరుగులు), మిచెల్ సాంట్నర్ (47 పరుగులు) ధాటిగా ఆడడంతో న్యూజిలాండ్ భారీ స్కోరు చేసింది.
Also Read: మళ్లీ లైన్‌లోకి విజయ సాయిరెడ్డి.. పొలిటికల్‌గా దారెటు..! ఏ పార్టీలోకి..?
న్యూజిలాండ్ బ్యాటర్లలో డెవాన్ కాన్వే 19, టిమ్ సీఫర్ట్ 24, రచిన్ రవీంద్ర 44, గ్లెన్ ఫిలిప్స్ 19, డారిల్ మిచెల్ 18, మార్క్ చాప్మన్ 10, మిచెల్ సాంట్నర్ 47, జాకరి ఫౌల్కెస్ 15 పరుగులు చేశారు.
హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే ఒక్కో వికెట్ తీయగా, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు.
