IND vs ENG 2nd Test : ముగిసిన రెండో రోజు ఆట‌.. ఆధిక్యంలో భార‌త్‌

విశాఖ టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది.

IND vs ENG 2nd Test : ముగిసిన రెండో రోజు ఆట‌.. ఆధిక్యంలో భార‌త్‌

India Vs England 2nd Test day 2

Updated On : February 3, 2024 / 5:03 PM IST

ముగిసిన రెండో రోజు ఆట‌.. 
రెండో రోజు ఆట ముగిసింది. భార‌త్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ న‌ష్ట‌పోకుండా 28 ప‌రుగులు చేసింది. రోహిత్ శ‌ర్మ (13), య‌శ‌స్వి జైస్వాల్ (15) లు క్రీజులో ఉన్నారు. ప్ర‌స్తుతం భార‌త్‌ 171 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది.

ఇంగ్లాండ్ ఆలౌట్‌
భార‌త బౌల‌ర్లు విజృంభించ‌డంతో ఇంగ్లాండ్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 253 ప‌రుగుల‌కు ఆలౌటైంది. దీంతో భార‌త్‌కు 143 ప‌రుగుల కీల‌క‌మైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ల‌భించింది. ఇంగ్లాండ్ బ్యాట‌ర్ల‌ల‌లో జాక్ క్రాలీ (76; 78 బంతుల్లో 11 ఫోర్లు, 2సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ చేశాడు. బెన్‌స్టోక్స్ (47; 54 బంతుల్లో 5 పోర్లు, 1సిక్స్‌), జానీ బెయిర్ స్టో (25) రాణించాడు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో జ‌స్‌ప్రీత్ బుమ్రా ఆరు వికెట్లు తీశాడు. కుల్దీప్ యాద‌వ్ మూడు, అక్ష‌ర్ ప‌టేల్‌ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

బెయిర్ స్టో ఔట్‌.. 
ఇంగ్లాండ్ మ‌రో వికెట్ కోల్పోయింది. జ‌స్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో బెయిర్ స్టో (25) శుభ్‌మ‌న్ గిల్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. దీంతో 35.4వ ఓవ‌ర్‌లో 159 ప‌రుగుల వ‌ద్ద ఇంగ్లాండ్ ఐదో వికెట్ కోల్పోయింది.

టీ బ్రేక్‌.. 
రెండో రోజు ఆటలో టీ విరామానికి ఇంగ్లాండ్ మొద‌టి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు న‌ష్ట‌పోయి 155 ప‌రుగులు చేసింది. జానీ బెయిర్ స్టో (24), బెన్ స్టోక్స్ (5) లు క్రీజులో ఉన్నారు.

వ‌రుస ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు తీసిన బుమ్రా
ఇంగ్లాండ్ జ‌ట్టు స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో రెండు వికెట్లు కోల్పోయింది. జ‌స్‌ప్రీత్ బుమ్రా త‌న వ‌రుస ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు తీశాడు. తొలుత జో రూట్‌(5)ను ఔట్ చేసిన బుమ్రా ఆ మ‌రుస‌టి ఓవ‌ర్‌లో ఓలీపోప్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.

జాక్ క్రాలీ ఔట్‌.. 
ఇంగ్లాండ్ మ‌రో వికెట్ కోల్పోయింది. అక్ష‌ర్ ప‌టేల్ బౌలింగ్‌లో జాక్ క్రాలీ(76; 78 బంతుల్లో 11 ఫోర్లు, 2సిక్స‌ర్లు) శ్రేయ‌స్ అయ్య‌ర్ క్యాచ్ అందుకోవ‌డంతో ఔట్ అయ్యాడు. దీంతో 22.3వ ఓవ‌ర్‌లో 114 ప‌రుగుల వ‌ద్ద రెండో వికెట్ కోల్పోయింది.

జాక్ క్రాలీ హాఫ్ సెంచ‌రీ..
కుల్దీప్ యాద‌వ్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి 52 బంతుల్లో జాక్‌క్రాలీ హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. 13 ఓవ‌ర్ల‌కు ఇంగ్లాండ్ స్కోరు 72/1. జాక్ క్రాలీ (50), ఓలి పోప్ (1) లు క్రీజులో ఉన్నారు.

బెన్‌డ‌కెట్ ఔట్‌.. 
ఎట్ట‌కేల‌కు భార‌త బౌల‌ర్లు వికెట్ ప‌డ‌గొట్టారు. బెన్‌డ‌కెట్ (21) కుల్దీప్ యాద‌వ్ బౌలింగ్‌లో ర‌జత్ పాటిదార్ క్యాచ్ అందుకోవ‌డంతో పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్ 10.2వ ఓవ‌ర్‌లో 59 ప‌రుగుల వ‌ద్ద తొలి వికెట్ కోల్పోయింది.

10 ఓవ‌ర్ల‌కు ఇంగ్లాండ్ స్కోరు 59/0
ఇంగ్లాండ్ ఓపెన‌ర్లు దూకుడుగా ఆడుతున్నారు. 10 ఓవ‌ర్ల‌కు వికెట్ న‌ష్ట‌పోకుండా 59 ప‌రుగులు చేసింది. జాక్ క్రాలీ (38), బెన్ డ‌కెట్ (21) లు ఆడుతున్నారు.

లంచ్ బ్రేక్‌
రెండో రోజు లంచ్ విరామస‌మ‌యానికి ఇంగ్లాండ్ వికెట్ న‌ష్ట‌పోకుండా 32 ప‌రుగులు చేసింది. జాక్ క్రాలీ (32), బెన్ డ‌కెట్ (17) లు క్రీజులో ఉన్నారు.

టీమ్ఇండియా ఆలౌట్‌
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 396 ప‌రుగులు చేసింది. టీమ్ఇండియా బ్యాట‌ర్లో య‌శ‌స్వి జైస్వాల్ (209; 290 బంతుల్లో 19 ఫోర్లు, 7 సిక్స‌ర్లు) దిశ‌త‌కం సాధించాడు. శుభ్‌మ‌న్ గిల్ (34), ర‌జ‌త్ పాటిదార్ (32), శ్రేయ‌స్ అయ్య‌ర్‌(27), అక్ష‌ర్ ప‌టేల్ (27)లు ఫ‌ర్వాలేద‌నిపించారు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో జేమ్స్ అండ‌ర్స‌న్‌, షోయ‌బ్ బ‌షీర్‌, రెహాన్ అహ్మ‌ద్‌లు త‌లా మూడు వికెట్లు తీశారు. టామ్ హార్ట్లీ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.


జైస్వాల్ ఔట్‌
డబుల్ సెంచ‌రీ అనంత‌రం స్కోరు వేగాన్ని పెంచే క్ర‌మంలో య‌శ‌స్వి జైస్వాల్ (209; 290 బంతుల్లో 19 ఫోర్లు, 7 సిక్స‌ర్లు) అండ‌ర్స్ బౌలింగ్‌లో షాట్‌కు య‌త్నించి బెయిర్ స్టో చేతికి చిక్కాడు. దీంతో భార‌త్ 106.5వ ఓవ‌ర్‌లో 383 ప‌రుగుల వ‌ద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది.

య‌శ‌స్వి జైస్వాల్ డ‌బుల్ సెంచ‌రీ
షోయ‌బ్ బ‌షీర్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి 277 బంతుల్లో 18 ఫోర్లు, 7 సిక్స‌ర్ల‌తో య‌శ‌స్వి జైస్వాల్ డ‌బుల్ సెంచ‌రీని పూర్తి చేసుకున్నాడు. య‌శ‌స్వి కెరీర్‌లో ఇదే తొలి ద్విశ‌త‌కం కావ‌డం విశేషం.

అశ్విన్ ఔట్‌..
రెండో రోజు ఆట ఆరంభ‌మైన కాసేప‌టికే భార‌త్ వికెట్ కోల్పోయింది. అండ‌ర్స‌న్ బౌలింగ్‌లో అశ్విన్ (20) బెన్ ఫోక్స్ క్యాచ్ అందుకోవ‌డంతో ఔట్ అయ్యాడు. దీంతో భార‌త్ 100.3వ ఓవ‌ర్‌లో 364 ప‌రుగుల వ‌ద్ద ఏడో వికెట్ కోల్పోయింది.

ఆరంభ‌మైన ఆట‌..
విశాఖ టెస్టు మ్యాచులో రెండో రోజు ఆట ఆరంభ‌మైంది. ఓవ‌ర్ నైట్ స్కోరు 336/6తో భార‌త్ రెండో రోజు ఆట‌ను ఆరంభించింది. య‌శ‌స్వి జైస్వాల్ (179), ఆర్ అశ్విన్ (5) లు క్రీజులో ఉన్నారు.